కుల వ్యవస్థే మన దేశానికి వెన్నుముక అని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ సమాజాన్ని‌ చదివి, అర్ధం‌ చేసుకోవాలని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి స్వామి సూచించారు. వర్ణం, వర్గ భేదాలు లేకుండా మనమంతా మానవులం అనేది గుర్తించాలని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి స్వామి సూచించారు.


నైపుణ్యమైన మేధస్సుకు కుల వృత్తులే నిదర్శనమని కమలానంద భారతి స్వామి అన్నారు. దేవాలయాల్లో మాల, మాదిగలకు మాన్యాలు ఉన్నాయన్నది‌ వాస్తవం కాదా అని కమలానంద భారతి స్వామి అన్నారు. కులాల్లో ఉన్న అస్తవ్యస్త స్థితిని సరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆది ఆంధ్రులు అని సగర్వంగా చెప్పుకున్న వాళ్లు మాదిగలు సామాజికవర్గం వారేనన్నారు. ఎంతో మంది దళితులు స్వయం ప్రేరణతో కట్టుకున్న ఆలయాలే దేశంలో ఎక్కువగా ఉన్నాయని కమలానంద భారతి స్వామి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: