ఇంధనం వాడటం అలవాటు చేసుకోవడం జరిగినప్పుడు కూడా అదొక కొత్త ఆవిష్కరణే. కానీ దాని వలన కాలుష్యం అనే సమస్య తదనంతర కాలంలో తెలియవచ్చింది. ఇలా ప్రతి కొత్త దానిలో ఏదో ఒక నెగటివ్ పాయింట్ ఉంటుంది. అయితే అవన్నీ ప్రకృతికి సహేతుకంగా ఉన్నాయా లేవా అనేది మాత్రం చూసుకోవాలనేది గత అనుభవాలతో తెలుసుకున్న విషయాలు. ఇప్పటికైనా అవన్నీ పక్కన పెట్టి, వాతావరణ హితమైన ఇంధనాలను వాడటం ద్వారా ఇప్పటికే భారంగా మారిన కాలుష్య సమస్యను కొద్దికొద్దిగా తగ్గించుకుంటూ మళ్ళీ మానవ జీవన విధానం ప్రకృతి హితంగా తయారు చేసుకునేందుకు మనిషి ప్రయత్నిస్తున్నాడు.

అందుకే సోలార్ వాడకం పెరిగింది. దీనిపై ఇంకా కాస్త అవగాహన తక్కువగానే ఉందని చెప్పాలి. అలాగే ధరలు కూడా సామాన్యులకు తగిన విధంగా లేకపోవడం కూడా మరో సమస్యగా చెప్పవచ్చు. అంటే కొత్త ఆవిష్కరణలు అటు ప్రకృతి హితంగాను, ఇటు ధరలలో ప్రియంగాను ఉండక తప్పదు. అలాంటి ఇంధనంతో నడిచే వాహనాలను ప్రస్తుతం ప్రపంచం రూపొందించేందుకు తహతహలాడుతోంది. అందులోనే చాలా వరకు పరిశోధనలలో విజయవంతం అయినప్పటికీ, రకరకాల కారణాల వలన అవన్నీ ప్రాథమిక దశలోనే ఆగిపోతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న విద్యుత్ వాహనాలు చూసుకోండి, అవి బయటకు తీసుకెళ్తే పొరపాటున బ్యాటరీ అయిపోతే అనేది పెద్ద సమస్యగాను ఉంది, అలాగే తగిన వేగం తో ప్రయాణించడానికి అవి ఉపయోగకరంగా ఉంటాయా అనే సందేహాలు కూడా ఉన్నాయి.  

సాధారణంగా ఏ లాంగ్ డ్రైవ్ కో వెళ్ళినప్పుడో తప్ప ఇంటినుండి కార్యాలయాలకు వెళ్ళేటప్పుడు సరాసరి వేగం 40-50 వరకు ఉంటె గొప్ప అనుకోవాలి, ఇప్పటి ట్రాఫిక్ లో. అంతకంటే వేగంగా వెళ్లే అవకాశం లేకపోయినా, 100 వేగం పైగా పోగలిగే వాహనాలు కావాలని అనుకుంటూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రతి అంశాన్ని చేర్చి కొత్త రకాన్ని అందుబాటులోకి తేవడం కాస్త కష్టమే. అందుకే ఒకటి కావాలి కంటే ఒకటి వదులుకోకతప్పదు అనేది చెప్పారు. ఇవన్నీ మరో దశాబ్దం కల్లా తెరపైకి వచ్చేస్తాయి అనుకోండి. కాకపోతే ఎంత చెట్టుకు అంత గాలి. అదే ఆడి వేగం ఆడిదే, ఆల్టో వేగం ఆల్టోదే అన్నట్టుగా ధరను బట్టి వేగాలు ఉండొచ్చు. తాగాజా గడ్కరీ గారు కూడా హైడ్రోజన్ తో నడిచే కారు కొన్నారని చెపుతున్నారు. దానిని(ఇంధనం) వృధా వ్యర్దాలతో తయారుచేసుకోవచ్చని అంటున్నారు. ఆ కారు త్వరలో రాజధానిలో తిప్పనున్నట్టు ఆయన తెలిపారు. అలాంటి ఇంధనంతో కూడిన వాహనాలు అన్నిటా చాలా త్వరలో రానున్నాయని కూడా ఆయన అన్నారు. చూడాలి ఇది అన్ని అంశాలతో అందుబాటులోకి వచ్చే వాహనమేనా అని.

మరింత సమాచారం తెలుసుకోండి: