ఇప్పుడు మార్కెట్‌లోకి కొత్త యూపీఐ (UPI) సర్వీసెస్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో మీరు చాలా ఈజీగానే పేమెంట్లు చేయొచ్చు. ఇంతకీ ఏ కంపెనీ ఈ సర్వీస్ లని అందుబాటులోకి తీసుకువచ్చిందో తెలుసుకోవాలని చూస్తున్నారా? ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తాజాగా సొంతంగానే యూపీఐ సేవలని అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేయాలని మీరు భావిస్తే.. పేమెంట్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్లు చెల్లింపులని మీరు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు ముంగింపు పలికేందుకు జొమాటోనే సొంతంగా యూపీఐ సర్వీసెస్ తీసుకువచ్చింది.పేమెంట్ చెల్లింపుల కోసం థర్డ్ పార్టీ యాప్స్‌ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం జొమాటో ఈ కొత్త సర్వీసులని తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. దీని వల్ల కస్టమర్లకు కూడా ఖచ్చితంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు పేమెంట్ సమయంలో థర్డ్ పార్టీ యాప్స్‌ ని ఓపెన్ చేయాల్సిన పని లేదు.


నేరుగా జొమాటో యూపీఐ ద్వారానే మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి చాలా ఈజీగా డబ్బులు చెల్లించొచ్చు. దీని ద్వారా పని చాలా ఈజీగా పూర్తి అవుతుంది. అంటే బిల్లు పేమెంట్ చేసేటప్పుడు పేటీఎం ,ఫోన్‌పే ఇంకా గూగుల్ పే వంటి వాటితో అవసరం లేదని చెప్పుకోవచ్చు. స్ట్రెయిట్ గా జొమాటో యూపీఐ ద్వారానే పేమెంట్ చేయొచ్చు.జొమాటో కంపెనీ  ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం ద్వారా ఈ కొత్త యూపీఐ సర్వీసెస్ ని తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. జొమాటో వాడే వారు యూపీఐ సేవలని పొందాలని భావిస్తే.. ముందుగా యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆ తర్వాతనే యాప్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. జొమాటో యూపీఐ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలని భావిస్తే..చాలా ఈజీగానే పని పూర్తి అవుతుంది. దీనికి కేవైసీ కూడా అవసరం ఉండకపోవచ్చు.ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద జొమాటో ఈ యూపీఐ సర్వీసెస్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.అందువల్ల ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ సర్వీసెస్ అందుబాటులో ఉండనున్నాయి. వచ్చే కొన్ని నెలల కాలంలో అందరికీ ఈ యూపీఐ సర్వీసెస్ అందుబాటులోకి రావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: