కొత్తిమీర చపాతీలా తయారీకి ముందుగా కావాల్సిన పదార్ధాలు....
గోధుమ పిండి - నాలుగు కప్పులు,
కొత్తిమీర తురుము - కప్పు,
వెన్న - ఒక టేబుల్ స్పూను,
పచ్చిమిరపకాయలు - రెండు,
ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
కొత్తిమీర చపాతీలు తయారు చేయు విధానం...
ముందుగా కొత్తిమీరను తీసుకోని దానిని చాలా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు చపాతీలకు ఎలా గోధుమపిండిని కలుపుతారో అలాగే కలపాలి. కలుపుతున్నప్పుడు కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి తరుము, కాస్త వెన్న, ఉప్పు వేసి బాగా కలపాలి. అలా ఒక గంట పాటూ వదిలేయాలి. తరువాత ఉండలుగా చుట్టుకుని చపాతీల్లా వత్తుకుని కాల్చుకోవాలి. వీటిని ఉత్తినే తిన్నా చాలా బాగుంటాయ్. లేదా చికెన్ కర్రీతో తింటే ఇంకా బాగుంటాయ్.ఇంకెందుకు ఆలస్యం.. ఈ రుచికరమైన కొత్తిమీర చపాతీలను మీరు తయారు చేసుకోని తినండి... ఆ రుచిని అనుభవించండి. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి