ఇలాంటి ఘటనలు ఆడపిల్లల భద్రతను ప్రశ్నార్థకం గా మార్చేస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఆడపిల్లలపై వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎవరిలో మార్పు రావడం లేదు. ఇటీవలి కాలంలో అయితే ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న వారు సైతం తమ దగ్గర చదువుకున్న బాలికల పట్ల దారుణాతి దారుణంగా వ్యవహరిస్తూ ఉండడం సభ్యసమాజాన్ని భయపెడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా చదువు చెప్పి సరైన మార్గంలో నడిపించాల్సిన టీచర్లే నిజమైన బుద్ధితో వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని మున్సిపల్ స్కూల్లో కి ఒక వ్యక్తి ప్రవేశించి ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ పోలీసులకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇక ఇలా స్కూల్ లోకి ప్రవేశించిన వ్యక్తి బాలికల బట్టలు విప్పి వారితో తరగతి గది ముందు బలవంతంగా మూత్రవిసర్జన చేయించినట్లు ఆమె ఆరోపించారు. బాలికలు ఇక ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ వద్ద ఫిర్యాదు చేయగా.. ఈ విషయాన్ని మర్చిపోవాలి అంటూ ప్రిన్సిపాల్ సూచించిందని స్వాతి మాలివాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై వెంటనే విచారణ జరపాలి అంటూ డిమాండ్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి