మనదేశంలో ఒక్కో కాలంలో ఒక్కో పండుకి డిమాండ్ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక వేసవికాలంలో ఇలా ఎక్కువగా డిమాండ్ ఏర్పడే పండు ఏదైనా ఉంది అంటే అది మామిడి పండ్లు అని చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నా కూడా రోడ్డు పక్కనే మామిడి పండ్ల బండ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక వాటిని చూడగానే ఆరగిస్తే ఎంత బాగుంటుందో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ నోరూరిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఎండాకాలం పూర్తయింది వర్షాలు కూడా మొదలయ్యాయ్. దీంతో ఇప్పుడు మామిడి పండ్లకీ ఉన్న గిరాకీ క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది.



 దీంతో మొన్నటి వరకు ఆకాశాన్నంటిన మామిడిపండ్ల ధర క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది అని చెప్పాలి. అయితే మామిడిపండ్ల ధరలు తగ్గుతున్న తీరు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది అని చెప్పాలి. వారం రోజుల క్రితమే తోతాపూరి మామిడి రకం కిలో కేవలం 12 రూపాయలు మాత్రమే పలికింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా కిలో తొమ్మిది రూపాయలకు పడిపోయింది. మామిడి పండ్లు స్టాక్ ఎక్కువ అవడం ఇక సీజన్ మారడంతో మామిడి పండ్లను తినేందుకు జనాలు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇలా మామిడిపండ్ల ధరలు అంతకంతకు తగ్గిపోతున్నాయి అన్నది అర్థమవుతుంది.



 అయితే ఇక మామిడి పండ్లు ధరలు ఒక్కసారిగా తగ్గిపోతూ ఉండడంతో అటు రైతులందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు. అధికారులు మద్దతు ధర ప్రకటించినప్పటికీ కూడా ఫ్యాక్టరీ యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు అంటూ వాపోతున్నారు రైతులు. దీనిపై అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలి అంటూ రైతులు కోరుతున్నారు అని చెప్పాలి. అయితే మామిడిపండ్ల ధర మరింత దిగజారితే మాత్రం రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది అనడంలో సందేహం లేదు. ఇక దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: