లోకేశ్ ప్రస్తుతం చేస్తున్న పాదయాత్ర వైసీపీ పార్టీ నాయకులను ఉలికి పడేలా చేస్తుంది. లోకేశ్ పక్కా ప్రణాళికతో ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారో అక్కడ గ్రౌండ్ లెవల్లో వైసీపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. పాదయాత్ర చేసే నియోజకవర్గంలో  వైసీపీ ఎమ్మెల్యే ఉంటే ముందుగానే అతడి గురించి పూర్తి డిటేల్స్ తెప్పించుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే చేసిన అవినీతి, చేస్తున్న అన్యాయాలు, గతంలో చేసిన కబ్జాలు, ప్రస్తుతం చేస్తున్న దందాలు ఇవి అంటూ ప్రజలకు తెలియజేస్తున్నారు. పాదయాత్రలో ఆయా ఎమ్మెల్యేలపై చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నాయకులు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నట్లు తెలుస్తోంది.


లోకేశ్ కు సరైన కౌంటర్ ఇవ్వలేక విషయాన్ని ప్రజలకు అర్థం చేసుకునేలా చెప్పలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. లోకేశ్ పాదయాత్రలో ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లగలుగుతున్నారు. మొదట్లో పాదయాత్ర అంత పెద్దగా సక్సెస్ కాకపోయినా ప్రస్తుతం ప్రజల్లోకి వెళుతోంది. జనాలు కూడా బాగానే వస్తున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన కబ్జా గురించి బహిరంగంగానే లోకేశ్ తన పాదయాత్రలో విమర్శలు చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పారు.


అలాగే ఎమ్మెల్యే శ్రీదేవి విషయంలో వైసీపీ పార్టీ వారు అనుసరించిన విధానం గురించి కూడా ఆయన మండి పడ్డారు. శ్రీదేవిని ఎందుకు సస్పెండ్ చేశారు. ఒక మహిళ ఎమ్మెల్యేను చూసే పద్ధతి ఇదేనా అంటూ చురకలంటించారు. వీటిన్నింటికి ఆయా ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు కౌంటర్ ఇవ్వలేకపోతే సాక్షి పత్రిక ఇవ్వాల్సి వస్తోంది. సాక్షి పత్రికలో తెల్లవారి లోకేశ్ మాట్లాడిన దానికి కౌంటర్ చూసుకోవాల్సిన పరిస్థితి వైసీపీ నాయకులది. ఎమ్మెల్యేల వరకు లోకేశ్ ఎటాక్ చేస్తుంటే ఆపై స్థాయి వారిని చంద్రబాబు చూసుకుంటున్నారు. తండ్రీ కొడుకులు కలిసి చేస్తున్న రాజకీయ విమర్శలను తిప్పి కొట్టడంలో ఈ మధ్య వైసీపీ నాయకులు విఫలమవుతున్నట్లే కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో లోకేశ్ కు పాదయాత్ర వల్ల మరింత క్రేజ్ వచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: