దేశంలో ఇప్పుడు డబ్బుకు కొదవ లేదు. డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. డబ్బులు పంచే పథకాలు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, విదేశాల్లో ఆర్థిక సంక్షోభం, ఇండియాలో ఉద్యోగాలు, ఉపాధి ఎక్కువగా దొరకడంతో డబ్బులకు కొదవ లేకుండా పోతుంది.
నోట్ల వినియోగంతో పాటు, డిజిటల్ చెల్లింపులు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. దీని వల్ల ఇండియా ఆర్థికంగా బలపడినట్లు తెలుస్తోంది.


దేశంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రతి రోజు ఒక రికార్డును బ్రేక్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రతి చిన్న షాపు వద్ద డిజిటల్ చెల్లింపు విధానం ఉపయోగిస్తున్నారు. దీంతో యూపీఐ చెల్లింపులకు ఎక్కువగా ప్రజలు అలవాటు పడ్డారు. ఇది ఆర్థికంగా రీ సైకిల్ కావడానికి కారణమవుతుంది. 2026-27 నాటికి డిజిటల్ చెల్లింపులు అనేవి రోజుకు రూ. 100 కోట్ల వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. రాబోయే కాలం మొత్తం డిజిటల్ యుగంగా మారనున్నట్లు వెల్లడవుతోంది. దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో సింహ భాగం మొత్తం రిటైల్ చెల్లింపులు ఉన్నట్లు పేర్కొంటున్నారు.


ఇండియా పేమెంట్స్ హ్యండ్ బుక్ పేరిట పీడబ్ల్యూసీ ఒక నివేదిక విడుదల చేసింది. 2022, 23 సంవత్సరాల్లో 83. 71 కోట్ల రూపాయల డిజిటల్ చెల్లింపులు జరిగినట్లు చెప్పింది. వీటిలో రిటైైల్ కొనుగోళ్ల వాటా 70 శాతం. 2026-27 నాటికి దేశంలో మొత్తం 37,800 కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇందులో రిటైల్ కొనుగోళ్ల వాటా చెల్లింపులే 90 శాతం ఉంటాయని తెలిపింది. దేశంలో క్రెడిట్ కార్డు చెల్లింపుల కంటే డెబిట్ కార్డు చెల్లింపులే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.


2026 వచ్చే సరికి డెబిట్ కార్డుల కంటే క్రెడిట్ కార్డుల లావాదేవీలే ఎక్కువ జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గత అయిదేళ్లలో క్రెడిట్ కార్డు చెల్లింపులు 21 శాతం పెరిగితే, డెబిట్ కార్డు చెల్లింపులు కేవలం 3 శాతం పెరిగినట్లు తెలిపింది. ఓవరాల్ గా చూసుకుంటే డిజిటల్ కరెన్సీ పెరుగుదల ఎక్కువగా ఉండేట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: