కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనడానికి చక్కటి నిర్వచనం చూపించారు ఈ పెద్దాయిన.. వయసుతో సంబంధం లేకుండా 64 సంవత్సరాల వయసులో గేట్ పరీక్షలో 140 వ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం వాసి. చదువుకోవాలనే శ్రద్ధ, పట్టుదల ఉంటే చదువుకు వయసు అడ్డు రాదు అని చెప్పవచ్చు. పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీర్ గా 39 సంవత్సరాల పాటు పనిచేసిన సత్యనారాయణ రెడ్డి 2018 లో డీ ఈ ఈ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు.. ఇద్దరు కుమారులు, మనవరాళ్ళూ , మనవళ్ళూ కూడా ఉన్నారు . పదవీ విరమణ చేసిన తర్వాత ఈయన ఎమ్ టెక్ పూర్తిచేసి గేట్ పరీక్షలో జాతీయస్థాయిలో 140 వ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

రిటైర్మెంట్ తర్వాత సమయం వృధాగా పోతుందని ఆలోచించిన సత్యనారాయణ రెడ్డి ఎంటెక్ చదవాలని ఉన్నత చదువుల వైపు అడుగులు వేశారు. అంతేకాదు చదవాలనే వారికి వయసు అడ్డురాదని నిరూపిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కూడా. JNTU లో ఎమ్ టెక్ పూర్తి చేసిన ఈయన అనుకోకుండా జాతీయ స్థాయిలో గేట్ పరీక్షలో 140 వ ర్యాంకు సాధించడంతో ప్రతి ఒక్కరు షాక్ కి గురి అవుతున్నారు. 2019లో JNTU సివిల్ విభాగంలో ఎంపీ లో చేరిన 2022లో అండర్ JNTU కింద ఎంటెక్ పూర్తిచేశారు.

ఇటీవల జరిగిన 2022 గేట్ పరీక్షలు జియో మాటిక్స్ ఇంజనీరింగ్ పేపర్ లో ఈయన 140 వ ర్యాంక్ సాధించడం గమనార్హం. ఇకపోతే గేట్ సాధించిన అభ్యర్థులు ఉన్నతవిద్య ప్రవేశానికి మూడు సంవత్సరాల పాటు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చర్చించి ముంబైలోని రౌర్కెల లో ఉన్న ఐఐటీలో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం,  రిమోట్ సెన్సింగ్ కోర్సులో చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు.. ఏదైనా సాధించాలి అంటే అందుకు వయసు అవసరం లేదు కేవలం కృషి, పట్టుదల ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అని ఈ పెద్దాయన నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: