మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. ఐర‌న్ ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తింటేనే మ‌న‌కు ర‌క్తం ఎక్కువ‌గా పెరుగుతుంది.  ఇక చాలా మంది నిత్యం ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను తీసుకుంటారు. కానీ ఇవి కాకుండా ఇతర పోష‌కాలు తీసుకోవ‌డంపై దృష్టి పెట్ట‌రు. అయితే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన సూక్ష్మ పోష‌కాల్లో ఐర‌న్ చాలా ముఖ్య‌మైంది. శరీరంలో ఐరన్ ఏమాత్రం తగ్గినా అనారోగ్యానికి గురికావల్సిందే.


ఐరన్ లోపిస్తే హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గి శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీంతో రక్తహీనత వస్తుంది. ఫలితంగా తీవ్ర అల‌స‌ట ఉంటుంది. చిన్న చిన్న ప‌నుల‌కే ఎక్కువగా అల‌సిపోతారు. అల‌స‌ట‌తో పాటు చికాకు, బ‌ల‌హీనంగా మార‌డం, ఏకాగ్ర‌త కుద‌ర‌క‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. చర్మం తెల్లగా పాలిపోయినట్లు కనిపించడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తలనొప్పి, అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం ఇలా అనేక ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.


పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఎర్రరక్త కణాల లోపంతో ఎనీమియా వస్తుంది. అయితే దీన్ని అదిగ‌మించాలంటే ఐరన్‌తో కూడిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, బీట్‌రూట్, గుమ్మడి, చిలగడదుంప, కొబ్బరి, సోయాబీన్ ఉండాలి. అదే డ్రై ఫ్రూట్స్, ఆప్రికాట్స్, బీన్స్, చేపలు, నట్స్ తదితర ఆహారాలను తరచూ తీసుకుంటుంటేనే శరీరానికి ఐరన్ సరిగ్గా అంది.. ఆరోగ్యంగా ఉండ‌గ‌లం.


మరింత సమాచారం తెలుసుకోండి: