సునాముఖి  ఆకులు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏ పదార్థాలతో కలిపి తీసుకుంటున్నాము అనే దానిమీద దాని ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. అది ఎలాగంటే ఒక స్ఫూన్ సునాముఖి ఆకు చూర్ణం, అర కప్పు ఆవుపాలతో కలిపి తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవడమే కాకుండా శరీరం కాంతివంతంగా ఉంటుంది.                                               
 
 సునాముఖి ఆకు చూర్ణం నెయ్యి  కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక రుగ్మతలు తొలగిపోతాయి. చక్కెరతో కలిపి తీసుకుంటే వాతం తగ్గుతుంది. తేనెతో కలిపి తీసుకోవడం వల్ల దాతు పుష్టి కలుగుతుంది. మేక పాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరం బలిష్టంగా అవుతుంది. గుంటగలగర ఆకుల రసం తో తీసుకుంటే వెంట్రుకలు నల్లబడతాయి. ద్రాక్ష రసంతో తీసుకుంటే కంటి తేజస్సు పెరుగుతుంది. అంతేకాకుండా అనేక రోగాలకు బాగా పనిచేస్తుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 మూడు గ్రాములు సునాముఖి ఆకుల చూర్ణము, మూడు గ్రాముల పటిక బెల్లం కలిపి రోజూ రెండుపూటలా సేవిస్తుంటే శరీరం పుష్టిగా ఉంటుంది.

 రాత్రి పడుకోబోయే ముందు 10 గ్రాముల సునాముఖి ఆకుల చూర్ణాన్ని తీసుకొని వేడినీటితో కలిపి సేవించడం వల్ల సుఖ విరోచనాలు అవుతాయి.

 కంటికి సంబంధించిన జబ్బులు ఏవైనా ఉన్నప్పుడు రెండున్నర గ్రాముల సునామీ ఆకుల చూర్ణాన్ని, రెండున్నర గ్రాముల ఫిరంగి చెక్క చూర్ణం కలిపి 40 రోజులు తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి.

 మూత్ర పిండాల్లో రాళ్లు కరిగి పోవడానికి గ్రాములు సునాముఖి ఆకు చూర్ణం, 10 గ్రాముల దోస గింజల చూర్ణం కలిపి తాగడం వల్ల మూత్ర  పిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.

 ఒంటి  నొప్పిలు ఎక్కువగా ఉన్నప్పుడు గ్రాములు సునాముఖి ఆకుల చూర్ణాన్ని ఆవు నెయ్యితో కలిపి తినడం వల్ల అన్ని  రకాల ఒంటి నొప్పులు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: