
దాని కోసం ముందు రోజు రాత్రే ఒక కప్పు నీటిలో 2-4 వాల్ నట్స్ ను వేసి, ఆ రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ప్రొద్దున్నే బాగా నానిన వాల్ నట్స్ తినాలి. ఇలా నానబెట్టిన వాల్ నట్స్ కి శరీరంలోని చెడు కొవ్వును కరిగించేంత శక్తి ఉంటుంది.
వాల్ నట్స్ లో మెలటోనిన్ అనే రసాయనం అధికంగా ఉండడం వల్ల నిద్రలేమితో బాధపడేవారు, వీటిని తింటే మీరు రాత్రిళ్లు హాయిగా నిద్రపోవచ్చు.నానబెట్టిన వాల్ నట్స్ ను రాత్రి పడుకునే గంట ముందు కూడా తింటే తొందరగా నిద్రలోకీ జారుకుంటారు.అంతే కాక బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.
వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించడం వల్ల,ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.దీనితో వైరల్ జ్వరం, జలుబు వంటి ఎన్నో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి.
ఇందులో విటమిన్ ఇ, మెలటోనిన్, పాలీఫెనాల్స్ అని పిలువబడే మొక్కల రసాయనాలు పుష్కలంగా ఉంటాయి.ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఎండాకాలంలో సూర్యుడు నుంచి వచ్చే, అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతాయి.
వాల్ నట్స్ లో ఉండే పాలీఫెనాల్స్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.ఇలాంటి అనారోగ్యాలు రావడానికి అసలు కారణం శరీరంలో చెడుకొవ్వులు పేరుకుపోవడం, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరగడం.వీటిని తగ్గించడానికి వాల్ నట్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది.