
డాన్స్ చేస్తూ కొందరు.. వాకింగ్ చేస్తూ మరికొందరు .. జిమ్ చేస్తూ మరికొందరు ఇలా హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తూ వస్తున్నారు. అయితే దీన్నంతటికి కారణం మారిపోయిన కల్చర్ . మరీ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం.. అంటున్నారు వైద్య అధికారులు. ఈ మధ్యకాలంలో చాలామందిలో ఎక్కువగా గమనిస్తున్న మరొక సింప్టమ్ గుండెల్లో దడ పెరిగిపోవడం . సడన్ గానే గుండె దడ పెరిగిపోతూ వస్తూ ఉంటుంది . మన గుండె చప్పుడు మనకి ఏదో ఒక పెద్ద ఇబ్బందికరంగా వినిపిస్తూ ఉంటుంది . మెట్లు ఎక్కిన .. ఏదైనా టెన్షన్ పడ్డ ఎక్కువ సేపు నడిచిన ఒళ్లంతా చెమటలు పట్టేసి గుండెదడ పెరిగిపోతూ ఉంటుంది. గుండె దడను వైద్య పరిభాషలో పాల్ప్టేషన్ అంటారు .
చాలామంది జీవిత కాలంలో ఏదో ఒకసారి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది . కానీ ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్ వాళ్లకి ఇలా ఎక్కువగా తమ గుండెచప్పుడు తమకే వినిపిస్తూ ఉండడం చూస్తున్నాం. గుండె నిత్యం స్పందిస్తున్నప్పటికీ అది కొట్టుకుంటున్న తీరు సాధారణంగా మన అనుభవంలోకి రాదు . కొన్నిసార్లు వేగంగా స్పందించే ఆస్పందన కొంతమంది వ్యక్తులు కనిపెడుతుంటారు. మరి ముఖ్యంగా ఏదైనా భయపడినప్పుడు టెన్షన్ పడినప్పుడు ఎక్కువ ఆయాసపడిపోయినప్పుడు మన శక్తికి మించి పనులు చేసినప్పుడు .. ఇలా గుండె దడ పెరిగిపోతూ ఉంటుంది .
అయితే అది ఒకటి రెండు సార్లు వస్తే ప్రాబ్లం లేదు . కానీ పదేపదే గమనిస్తూ ఉంటే మాత్రం అస్సలు ఆలస్యం చేయకూడదు . వెంటనే డాక్టర్ను సంప్రదించాలి . అది గుండెజబ్బు రావడానికి కూడా ప్రధాన కారణం కావచ్చు అంటున్నారు వైద్యాధికారులు . అంతేకాదు చాలా బరువు ఉన్న వాళ్ళు వెంటనే లావు తగ్గాలి అని వెంట వెంటనే పరిగెడుతూ ఎక్కువగా ఆయాస పడిపోతూ నడుస్తూ వస్తారు. మరి కొందరు ఆయాసం మీద నీళ్లు తాగుతూ ఉంటారు. అలాంటివి అస్సలు చేయకూడదు . నెమ్మదిగా నడవడం ఆయాసం ఉన్నప్పుడు అస్సలు నీళ్లు తాగకపోవడం చాలా చాలా మంచిది . అంతే కాదు మనమేదైనా భయపడినప్పుడు గుండె దడ మనకి మనకే వినిపిస్తూ ఉంటే ముందు ప్రశాంతంగా కూర్చోవాలి. కళ్ళు మూసుకొని మనల్ని మనం కంట్రోల్ చేసుకునే పద్ధతిని అలవాటు చేసుకోవాలి . ఒకటి రెండు సార్లు ఇలా ఉంటే పర్లేదు ఎక్కువసార్లు ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించక తప్పదు . బిపి - షుగర్ ఉన్న పేషెంట్లు ఎక్కువగా గుండె దడ వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే చాలా చాలా మంచిది..!