
అయితే కరోనా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా ఏపీ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. ఎప్పటికప్పుడు కరోనా పై జాగ్రత్తలు తీసుకుంటూనే వస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రార్ధన సమావేశాలు ..సామాజిక సమావేశాలు.. రాజకీయ పార్టీల బహిరంగ కార్యక్రమాలు వంటివి తక్షణమే ఆపేయాలి అంటూ ప్రభుత్వం పేర్కొంది . అంతేకాదు రైల్వేస్టేషన్లో .. బస్టాండ్లో ..విమానాశ్రయాలలో కోవిడ్ రూల్స్ కంపల్సరిగా పాటించాలి అని స్పష్టం చేసింది. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి అంటూ స్పష్టం చేశారు .
60 సంవత్సరాలు దాటిన వాళ్ళు బయటకి అసలు రాకూడదు అని.. గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఇంటి లోపలే ఉండాలి అని సూచించారు. మంచి పరిశుభ్రతను పాటించాలి అని .. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మంచిది అంటూ సూచించారు . దగ్గు - తుమ్ములు - జలుబు గొంతు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి అంటూ సూచించారు . కోవిడ్ సంబంధించిన లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకొని పాజిటివ్ వస్తే క్వారంటైన్ అయిపోవాలి అంటూ సూచించారు . కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు పరీక్షలు కంపల్సరీ చేయాలి అని సూచించారు. ప్రభుత్వ ల్యాబ్ లు 24 గంటల పాటు అందుబాటులోనే ఉండాలి అని ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
అయితే కొంతమంది కరోనా కేసులు పెరిగిపోతున్నాయ్ అని తెలిసిన మాస్కులు వేసుకోకుండా ఎక్కడికక్కడ రోడ్డుపై ఉమ్మేస్తూ వస్తున్నారు. రోడ్డు పక్కనే మూత్రం పోసేస్తున్నారు . దీంతో కొంతమంది ఇవి చూసి ఫైర్ అయిపోతున్నారు . ఇలాంటి పనులు చేసే వాళ్ళని వెంటనే బొక్కలో వేసేయండి సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు..!