
పట్టణ ప్రాంతాలలో దీని ప్రబల్యం గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి . మరీ ముఖ్యంగా హర్యానాలోని కర్నాల్ పట్టణ ప్రాంతంలో ప్రతి లక్ష మందిలో 26.6 మందికి ఈ వ్యాధి ఉంది అంటూ తేలింది . గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 4.27 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది .
ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి :
ముంబైకి చెందిన పదహారేళ్ల విద్యార్థి టైప్ వన్ మధుమేహంతో బాధపడుతున్నారు. ఆ విద్యార్థి ఏమన్నాడంటే "నా ఫోన్ మాదిరిగానే నా ఇన్సూలిన్ కూడా ఎప్పుడు నా వెంట తీసుకెళ్తున్నాను. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు . ఇది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది " అంటూ చెప్పుకొచ్చారు . అదే విధంగా అహ్మదాబాద్ లోని బీజే మెడికల్ కాలేజ్ అధ్యయన ప్రకారం టైప్ వన్ మధుమేహం ఉన్న పిల్లల్లో 81 శాతం మంది ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు అని .. అధిక దాహం ఎక్కువగా కనిపిస్తుంది అంటూ తేలింది . అంతే కాదు టైప్ వన్ మధుమేహం ని ప్రారంభోత్సవ గుర్తిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకొని కాపాడుకోవచ్చు అంటూ కూడా డాక్టర్ చెప్తున్నారు . మరీ ముఖ్యంగా వివరించలేని బరువు తగ్గడం అధిక దాహం వంటి లక్షణాలు ఎప్పుడూ పిల్లలు లో గమనిస్తూ ఉండాలి అని తల్లిదండ్రులకు హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.
టైప్ వన్ డయాబెటిస్ చికిత్స - క్యూర్ ఎలా ఉంటుంది:
ప్రతిరోజు అనేక ఇంజక్షన్లు తీసుకోవడం లేదా ఇన్సులిన్ పంపులోకి ఉపయోగించడం సరైన స్థాయిలను గుర్తించడానికి క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా కార్బోహైడ్రేట్ లని నియంత్రించాలి. వ్యాయామం లాంటివి చేస్తూ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీలు కచ్చితంగా ఉండాలి. భారత్ లో ఎక్కువగా పిల్లలకు మధుమేహం వస్తుందని చాలామందికి తెలియదు . సాధారణంగా 25 - 30 తర్వాతేనే వస్తుంది అని కొట్టి పడేస్తున్నారు జనాలు. అయితే 19 లోపు వయసు వారికి కూడా టైప్ వన్ మధుమేహం వస్తుంది అంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదైన లక్షణాలు కనిపిస్తే సొంత చిట్కాలు వాడకుండా డాక్టర్లని సంప్రదించడం ఉత్తమమ.