
మానవ జీవితం లో ఎక్కిళ్లు అనేది సర్వ సాధారణంగా వస్తూ ఉంటుంది. . ఇది కొందరి లో చాలా ఎక్కువు గా ఉంటుంది. ఒక్కో సారి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కిళ్లు ఆగవు. ఈ క్రమంలో నే చాలా మంది మంచినీళ్లు తీసుకుని ఎక్కిళ్లు నివారించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు మంచి నీళ్లు తీసుకున్నా ఎక్కిళ్లు మాత్రం ఆగవు. ఎక్కిళ్లు కంట్రోల్ చేసుకునేందుకు కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి.
- నల్లేరు కాడలు తెచ్చి కుమ్ములో ఉడకబెట్టి రసముపిండి ఆ రసము 5ml తేనే 5ml కలిపి పూటకొక సారి రోజూ రెండుసార్లు తీసుకున్న యెడల ఎక్కిళ్లు తగ్గుతాయి.
- నెమలిపింఛం కాల్చి మసిచేసి ఆ మసి , తేనె , తమలపాకులరసం సమభాగములుగా కలిపి పూటకు 5 గ్రాములు చొప్పున రోజుకి మూడుపూటలా ఇచ్చుచుండిన యొడల ఎక్కిళ్లు హరించును . .
- శోంఠి , తేనె కలిపి ఒక చిన్న ఉసిరి కాయ అంత ఉండ చేసి బుగ్గన పెట్టుకొని రసం మింగుతూ ఉండాలి. ఇలా రెండు నుంచి మూడు సార్లు చేయుచున్న ఎక్కిళ్ళు తగ్గును.
పైన తెలిపిన యోగాలలో ఏదో ఒక సులభ యోగాన్ని పాటించి ఎక్కిళ్ళు సమస్య నివారించుకోవచ్చు. ఇది ప్రధానంగా వాతదోషం పెరగడం వల్ల ఈ సమస్య ఏర్పడును.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ...
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు