తెలుగు కుటుంబాల్లో అత్యంత సాధారణంగా కనిపించే పండు అరటిపండు. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ దొరికే ఈ పండు రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలా మందిలో "అరటిపండు తింటే బరువు పెరుగుతుందా? లేక తగ్గుతుందా?" అనే సందేహం ఉంటుంది. దీనిపై ఆరోగ్య నిపుణులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తున్నారు.


అరటిపండులో ఏముంటుంది ? మీడియం సైజు అరటిపండులో సుమారుగా :

105 కేలరీలు

27 గ్రాముల కార్బోహైడ్రేట్లు

3 గ్రాముల ఫైబర్

1.3 గ్రాముల ప్రోటీన్

0.3 గ్రాముల కొవ్వు ఉంటాయి.

ఇవి చూస్తే తక్కువ కొవ్వు, ఎక్కువ ఫైబర్, సహజ చక్కెరలతో శక్తివంతమైన పండు అని తెలుస్తుంది. అయితే సమయానికి తినకపోతే లేదా అధికంగా తింటే, బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగాలంటే... అరటిపండులో సహజ చక్కెర మరియు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల, శారీరక శ్రమ లేకుండా ఎక్కువగా తినడం వల్ల ఆ చక్కెరలు శరీరంలో కొవ్వుగా మారే ప్రమాదం ఉంటుంది. నిపుణుల ప్రకారం : "రోజుకు 2–3 అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.   బరువు పెరగాలనుకునే వారు అరటిపండును పాలతో కలిపి, వేరుశెనగ, వెన్న, గింజలు లేదా పెరుగుతో కలిపి తీసుకుంటే మరింత మేలు ఉంటుంది.


 బరువు తగ్గాలంటే... అరటిలో ఉండే ఫైబర్ బహు కాలం పాటు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. దీని వలన వెంటనే ఆకలి వేయదు. అందువల్ల తక్కువ తినే అవకాశం ఉంటుంది. అలాగే అరటి తినడం వల్ల వ్యాయామానికి అవసరమైన శక్తి కూడా లభిస్తుంది. "బరువు తగ్గాలనుకునేవారు రోజుకు కేవలం ఒక్క అరటిపండే తినాలి. స్మూతీల్లో చక్కెర, పాలు కలపకూడదు ... డైటీషియన్ల సిఫార్సు ఏమిటంటే? రోజుకు ఒక అరటిపండు తినడం సురక్షితం, ఆరోగ్యకరం .. ఉదయాన్నే అల్పాహారంలో లేదా వర్కౌట్‌కు ముందు తినడం మంచిది ..  బరువు తగ్గాలనుకుంటే, సాదాసీదాగా తినాలి.. బరువు పెరగాలనుకుంటే, పాలు, గింజలు, వెన్నతో కలిపి తీసుకోవచ్చు. అరటిపండు బరువు పెంచేదా, తగ్గించేదా అన్నది మీరు ఎలా తీసుకుంటున్నారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. సమయానికి తినడం, పరిమితికి లోబడి తినడం, సరైన ఫిజికల్ యాక్టివిటీ ఉంటే – ఇది ఆరోగ్యానికి మేలే.

మరింత సమాచారం తెలుసుకోండి: