ఇక చరిత్రలో ప్రతి రోజు కూడా చాలా విలువైనది. ప్రతి రోజు జరిగిన ముఖ్య సంఘటనలు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు చూసుకున్నట్లయితే..1804 వ సంవత్సరంలో హైదరాబాదులోని మీర్ ఆలం టాంక్ నిర్మాణం ఈరోజే ప్రారంభమయ్యింది.ఇక 1977 వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ చేశారు.ఇక 1977 వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించడం జరిగింది.ఇక 1978 వ సంవత్సరంలో లండన్ లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించడం జరిగింది.ఇక 1981వ సంవత్సరంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడింది.1982 వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించడం జరిగింది.1987 వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ చెయ్యడం జరిగింది.ఇక ఇదే సంవత్సరం ఇదే రోజున భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని అధిష్టించడం జరిగింది.

ఇక 1992 వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.ఇక 1997 వ సంవత్సరం భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు.ఇక 2002 వ సంవత్సరం భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.2007 వ సంవత్సరం భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది.2009 వ సంవత్సరం దేశంలో ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది.ఇక 1935 వ సంవత్సరంలో ఈరోజున కైకాల సత్యనారాయణ జన్మించారు. ఈయన ఓ గొప్ప తెలుగు సినీ నటుడు.ఇక 1978 వ సంవత్సరంలో లూయీస్ బ్రౌన్ జన్మించారు. వీరు తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ కావడం విశేషం.1971 వ సంవత్సరంలో గుఱ్ఱం జాషువా మరణించారు. ఈయన ప్రముఖ తెలుగు కవి ఇంకా రచయిత.ఇక 2009 వ సంవత్సరంలో జస్టిస్ అమరేశ్వరి మరణించారు. ఈమె భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: