సాధారణంగా పనిలో పడి చాలా మంది నిద్రను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అయితే ఇలా నిద్రను అశ్రద్ధ చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి అన్న మాట అని అందరికీ తెలిసినప్పటికీ తప్పని పరిస్థితులలో నిద్రను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అయితే సరిగ్గా సమయానికి నిద్రపోకపోతే ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువసేపు నిద్రపోవాలని చెప్పారు కదా.. అని గంటల తరబడి నిద్ర పోయినా సరే ప్రమాదం తప్పదు. కాబట్టి అతి నిద్ర, నిద్ర లేమి రెండూ ప్రమాదకరమే అని గుర్తుంచుకోవాలి.

ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువత నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిద్ర అనే విషయమే మర్చిపోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సెల్ ఫోన్ ప్రపంచం లోకి వెళ్ళిన తర్వాత తినాలి అనే ఆలోచన, నిద్ర పోవాలనే కోరిక రెండూ పుట్టవట. కాబట్టి సరైన సమయానికి తిని , కంటినిండా నిద్ర పోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని వైద్యులు చెబుతున్నారు.

సరైన నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, ఏ పని మీద  శ్రద్ధ పెట్టలేకపోవడం , వాంతులు, అసిడిటీ, సరిగ్గా జీర్ణం కాకపోవడం ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. వైద్యులు ఎంత హెచ్చరించినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు.. ఒక్కసారి అనారోగ్య సమస్యలు చుట్టుముడితే హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.. ఒక్కరోజు సరిగ్గా నిద్రపోక పోయినా కూడా చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.. కానీ చాలామంది ఒకరోజు నిద్రపోకపోతే ఏం కాదులే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.. కానీ ఒక్క రోజు కూడా నిద్ర పోకపోయినా ఎంతో ప్రభావం చూపిస్తుందట..

కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 7 నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రపోవాలి. ఇక నిద్ర ను కోల్పోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అని ఒక పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: