ఆషాడ మాసంలో గోరింటాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మిగతా రోజులలో పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ ఆషాడమాసంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒకవేళ అది ఎర్రగా పండితే చాలా మురిసిపోతూ ఉంటారు.. అయితే ఇది కేవలం అందంగా కనిపించడానికి మాత్రమే కాకుండా దీనివల్ల పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.



వేసవికాలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతూ ఉంటుంది  జోరుగా వర్షాలు పడడం వల్ల ఇలాంటి మార్పులు మొదలవుతాయి. దీనిని ఆషాడ మాసం అని పిలుస్తూ ఉంటారు . ఆషాడం వచ్చిందంటే చాలు వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. దీంతో వాతావరణం అంతా చాలా చల్లగా మారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా సూక్ష్మ క్రిములు కూడా పెరిగి రోగాలను కూడా వ్యాప్తి చేస్తూ ఉంటాయి అయితే వర్షాలు ఎక్కువ పడడం వల్ల వాతావరణ చల్లబడటం మాత్రమే జరుగుతుంది. కానీ మన శరీరంలో ఉండే వేడి అలాగే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారిపోతూ ఉంటుంది. దీంతో మన శరీరంలో కాస్త చికాకు కూడా ఏర్పడుతుంది.


ముఖ్యంగా గోరింటాకు వేడిని తగ్గించే అద్భుతమైన గుణమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రక్త ప్రసరణను కూడా సక్రమంగా జరిగేలా చూస్తుంది.


ఆషాడ మాసంలో కొత్త పెళ్లికూతురు తమ పుట్టింటికి చేరుకోవడం ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ.. ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకొని చూస్తూ మురిసిపోతూ ఉంటారు . వారు తమ భాగస్వామిని అందులో గుర్తు చేసుకుంటారట. వేళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి చాలా అందంగా కనిపించడమే కాకుండా గోళ్ళు పెలుసు బారిపోకుండా కూడా ఉంటాయి.కాని శాస్త్రం ప్రకారం చూస్తే గర్భాశయ దోషాలను తొలగిస్తుందని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఇక అంతే కాకుండా దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: