- ( లైఫ్ స్టైల్ - ఇండియా హెరాల్డ్ )

చదువు అయిపోయాక 6 అంకెల జీతంతో ఉద్యోగం పొందాలని సగటు భారతీయుడు కోరుకుంటాడు. ఆరు అంకెల‌ జీతం అంటే వార్షికాదాయం పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాంటిది ఏడాదికి 60 లక్షల సంపాదన ఉంటే లైఫ్‌ సెటిల్ అయిపోయింది అని అందరూ అనుకుంటారు .. కానీ ఏడాదికే 60 లక్షల రూపాయలు సంపాదించినా భారత్ లో విలువైన జీవితాన్ని పొందలేకపోతున్నాం అంట బెంగళూరుకు చెందిన వ్యక్తి తన ఆవేదన సోషల్ మీడియాలో పెంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు .. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. బెంగళూరులోని వారమాకు ప్రాంతంలో తన భార్యతో కలిసి జీవిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబ వార్షిక ఆదాయం 60 లక్షలు గా ఉంది. కానీ తాను విలువైన జీవితాన్ని పొందలేకపోతున్నట్టు ఆందోళన వ్యక్తం చేశాడు.


భార‌త్ లో మన ఆదాయంలో 30 నుంచి 40% వరకు పనులు కడతాము అందుకు ప్రతిఫలంగా ఏం పొందుతున్నామని ప్రశ్నించాడు ? కెనడా - జర్మనీ వంటి దేశాలు అధిక ప‌న్నులు విధించిన ప్రజలు ఉచిత వైద్యం , విద్య పొందుతున్నారు. అలాగే మెరుగైన .. మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నారు. కానీ భారతలో విద్య - ఆరోగ్యం లాంటి ప్రాథమిక సదుపాయాల కే ప్రవేట్ పై ఆధారపడాల్సి వస్తుందని తాగునీటికి ట్యాంకర్లపై ఆధార పడాల్సిన దుస్థితి నెలకొంటుంది. మరి ఈ పన్నులన్నీ ఎటు వెళుతున్నాయి అంటూ అతడు ప్రశ్నించాడు. తన ఇంటి నుంచి ఆఫీస్ కి కేవలం మూడు కిలోమీటర్ల దూరం మొన్న వెళ్లేందుకు 40 నిమిషాలకు పడుతుంది అని ఆ విధంగా వ్యక్తం చేశాడు.


రోడ్లన్నీ తవ్వేసినట్టు ఉంటాయని రోడ్డు పనుల్లో బెంగళూరు దేశంలో అగ్రస్థానంలో ఉంది కానీ గ‌తుకుల రోడ్లే దిక్కు అవుతున్నాయని శబ్ద కాలుష్యం ... ట్రాఫిక్ ఇవన్నీ రోజువారి అనుభవాలు కావడం బాధాకరమని తెలిపాడు. ఒక సాధారణ పెళ్లి సర్టిఫికెట్ పొందటానికి రు. 2000 ఇవ్వాల్సి వస్తుందని తెలిపాడు పెరిగింది. స్కూలు ఫీజులు విపరీతంగా పెరుగుతున్నాయి అంటూ జీవ‌న శైలీ పై నిరాశనం వ్యక్తం చేశాడు. తనకు ఇండియాలోనే ఉండాలని ఉందని కానీ సిస్టంతో విసిగిపోయినట్టు చెప్పాడు. ఈ పోస్ట్ పై సోషల్ మీడియాలో ఇప్పుడు వితృతమైన చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: