ప్రతి ఒక్కరికి సొంతంగా ఇల్లు ఉండాలి అనే కోరిక ఉంటుంది.  కొంతమంది ఆ కోరికను తీర్చుకోగలుగుతారు . కొంతమంది తీర్చుకోలేరు .  ఈ మధ్యకాలంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా లోన్ పెట్టి తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటున్నారు . అయితే దేశంలో టెక్ రంగానికి కేంద్రంగా ఇండియన్ సిలికా వ్యాలీ అంటూ బెంగళూరుకు వచ్చిన గుర్తింపు కర్ణాటక కు మంచి పేరే తెచ్చిపెట్టింది.  దీంతో చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి జనాభా బెంగళూరు తో పాటు కర్ణాటక వ్యాప్తంగా వ్యాపారాలు చేసేందుకు ఉద్యోగాలు చేసేందుకు అక్కడికి వెళ్లారు . అయితే ఈ క్రమంలో అక్కడే స్థిరపడాలని చూస్తున్నారు .


కొంతమంది లోన్ పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నారు . కొంతమంది ఉన్న డబ్బుని డౌన్ లోడ్ పేమెంట్ చేసి ఇల్లు కొనుకుంటున్నారు.  తాజాగా కర్ణాటక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన  రూల్ అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది . కర్ణాటక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇకపై అందరూ 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తుల విక్రయాలకు సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిపినప్పుడు సదరు పార్టీ నుంచి లేదా స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ తీసుకోవాలని తెలిపింది . ఎందుకంటే ఈ స్టేట్మెంట్ పంచుకోవడంలో చాలామంది సబ్ రిజిస్టర్లు నిర్లక్ష్యం వహిస్తూ ఉండడం వల్ల దాదాపు ఆదాయపన్ను శాఖకు కోట్ల నష్టం వస్తుందట . దీనిపై ఆదాయ పన్ను శాఖ ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాజాగా పాత రూల్ నే కొత్త గా అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.  ఆదాయపన్ను చట్టం 1961 లోని సెక్షన్ 285 బి ఏ వన్ కింద ఆ వివరాలను అందించడం తప్పనిసరి.

 

స్పెసిఫిక్ సమాచారం అంటే ఏంటి..?

ఏదైన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సమయంలో సదురు రెండు పార్టీల పాన్ వివరాలతో పాటు చిరునామా.. రిజిస్ట్రేషన్ తేదీ తో పాటు.. ఫారం సిక్స్టీ రసీదు .. పుట్టిన తేదీ ..ఫోన్ నెంబర్ ..ఆధార్ ..ఈమెయిల్ డబ్బు చెల్లించిన విధానం ట్రాన్సాక్షన్ విలువ ఎంత ప్రాపర్టీ వివరాలు ఎంత.. ఇకపై పూర్తిగా సబ్ రిజిస్టర్ లు తప్పనిసరిగా చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది . ఈ రెండు ప్రాపర్టీలు వివరాలను సరిగ్గా ఉన్నాయా..? లేదా..? చూసి  సంతకం చేసే బాధ్యత సబ్ రిజిస్టర్ ల దే.  వీటి వివరాల విషయంలో ఎటువంటి అవకతవకలు ఎదురైనా ..కఠిన  చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది .



అసలు చట్టం ఏం చెప్తుంది..?

ఎవరైనా ఒక వ్యక్తి పది లక్షల లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొన్న లేకపోతే అమ్మినా .. స్టాంప్ డ్యూటీ ప్రకారం సదరు ఆస్తి విలువ 30 లక్షల కంటే ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన సమాచారం అందించాల్సి ఉంటుంది.  ఇలాంటి పెద్ద టోకెన్ లావాదేవుల గురించి సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు పంపడం రిజిస్ట్రేషన్ శాఖకు అప్పగించబడిన బాధ్యతల్లో ఒకటి.  కానీ చాలామంది ఇప్పుడు దీన్ని పాటించడం లేదు. వాస్తవానికి  ఈ చర్య బ్లాక్ మనీతో ట్రాన్సాక్షెన్ లని  అరికట్టడంలో పాటు పన్ను ఎవరైతే ఎగ్గొడుతున్నారో వాళ్ళను గుర్తించేందుకు ఈజీగా ఉంటుంది . పన్ను వసూలను పెంచడం లక్ష్యంగా ఈ రూల్ ని మళ్లీ అమల్లోకి తీసుకువచ్చారు అధికారలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: