భార్య నుదిటిపై ప్రతి రోజు ముద్దు పెట్టే భర్తలు వారి జీవితంలో మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారనే విషయం ఒక తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. సాధారణంగా, రోజూ ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లేముందు భార్య నుదిటిపై భర్త ముద్దు పెడితే, వారి మధ్య అనుబంధం బలపడటం మాత్రమే కాకుండా.. దీర్ఘకాలికంగా వారి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది అని ఈ పరిశోధన చెప్పింది. మరి ఆ పరిశోధన వివరాలను చూసినట్లయితే..

అన్ని వయసులలో భార్యాభర్తలు తమ జీవితంలో అనుబంధాన్ని మెరుగుపరచుకోవడానికి చిన్న చిన్న చర్యలు చాలా ఉపయోగకరమని వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇందులో ఒక ముఖ్యమైన చర్యగా “ముద్దు పెడుతుండటం” అని గుర్తించబడింది. మరి ఇలా ముద్దు పెడుతుండటంతో కలిగే లాభాలను కూడా తెలిపారు. భర్త భార్యల మధ్య ముద్దు పెడుతున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ముద్దు పెట్టె ఈ చర్యతో రక్తసంచారం సరిగా కొనసాగుతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో సహాయం అందుతుంది.

అంతేకాదు.. ముద్దు పెడితే సెరోటోనిన్, డోపమైన్ లాంటి ఆనంద హార్మోన్లు విడుదలై మానసిక ఒత్తిడి తగ్గుతాయి.  దాంతో సంతోషంగా జీవించవచ్చు. రోజూ ఇలా అనుసరించేవారు ఐదు సంవత్సరాల పాటు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలుగుతారని వైద్యుల అధ్యయనం సూచిస్తుంది. వైద్యులు సూచిస్తున్న ముఖ్య కారణం ఇది మానసిక ఆరోగ్యానికి మంచిది కావడం మాత్రమే కాదు.. శారీరకంగా కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్పారు. అలాగే, కుటుంబ జీవితం ఆనందంగా సాగేలా సహకరిస్తుంది. భార్యాభర్తల మధ్య ఆత్మీయత పెరిగితే కుటుంబంలో అనవసరమైన కలహాలు తగ్గి శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది.

ఈ చిన్న ఆరోగ్య చిట్కాను ప్రతిరోజూ పాటించడం ద్వారా మన కుటుంబ సంబంధాలు బలోపేతం అవుతాయి. అలాగే, ఆరోగ్య సమస్యల సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే భార్య నుదిటిపై భర్తలు ప్రేమతో ముద్దు పెడుతూ, వారి మధ్య అనురాగం మరింత మధురంగా మార్చుకోవడం అవసరం. మొత్తం మీద భార్య నుదిటిపై ముద్దు పెడుతూ ప్రేమ చూపించడం ఒక చిన్న చర్య అయినప్పటికీ, దీని ఆరోగ్య ప్రయోజనాలు చాలా విస్తృతంగా ఉంటాయి. ఈ బంధాన్ని ప్రేమతో అందించడం ద్వారా భార్యభర్తల జీవితంలో ఆనందం, ఆరోగ్యం రెండూ బాగా నిలుస్తాయని ఈ అధ్యయనం మనకు నేర్పుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: