ఈ మధ్యకాలంలో ఇల్లు కట్టుకునేటప్పుడు స్టైల్ అంటూ టెక్నాలజీ అని రకరకాలుగా వాస్తుని ఫాలో అవ్వకుండా కొన్ని కొన్ని సంప్రదాయాలను తొక్కేస్తూ .. రకరకాలుగా ఫ్యాషన్ కల్చర్ తో ఇల్లును కట్టుకుంటున్నారు జనాలు.  మరీ ముఖ్యంగా కొంతమంది ఇంటి గుమ్మం ముందు కొంచెం స్పేస్ ఉన్నా సరే దాన్ని వేస్ట్ చేయకుండా ఏదో ఒక విధంగా అక్కడ క్యాబినెట్ ని ఏర్పాటు చేసేస్తున్నారు.  కానీ అది వాస్తూ చూడకుండా చేస్తే చాలా చాలా తప్పు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంటి గుమ్మంలో లేదా తలుపు ముందు చాలా మంది అద్దాలు పెడుతూ ఉంటారు.  అలా పెట్టకూడదు అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు . ఇది నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది అని ఇబ్బందులు పడుతారు అని చెబుతున్నారు .


అంతేకాదు ఇంటికి ఎదురుగా కత్తులు, గొడ్డళ్లు ,గునపాలు పెట్టకపోవడం చాలా చాలా మంచిది అంటున్నారు. వీటిని స్టోర్ రూమ్ లో ఒక మూలన ఉంచుకోవడం బెటర్ . విరిగిన వస్తువులు పగిలిన అద్దాలు ఇంటి ముందు ఉంచిన ఇంటి లోపల పెట్టిన అది మన జీవితంలోకి సమస్యలు తీసుకు వస్తాయట . అలాంటివి పడేయడమే బెటర్ . అంతేకాదు చాలామంది బయట నుంచి వచ్చాక చెప్పులను గుమ్మం ముందు ఎలా పడితే అలా వదిలేస్తూ ఉంటారు . కొంతమంది చొప్పలు స్టాండ్ లో కూడా పెట్టుకుంటారు . ఆ చెప్పుల స్టాండ్ కూడా కరెక్ట్ పొజిషన్లో పెట్టాలి . ఇంటికి గుమ్మానికి ఎదురుగా అస్సలు పెట్టకూడదు .



తలుపు తీస్తే చెప్పుల స్టాండ్ . ఆ గుమ్మానికి తగలకూడదు . అలా పెట్టుకోవాలి గుమ్మం ఎదురుగా చెప్పులు  విడవకూడదు . అటుపక్క లేదా గుమ్మానికి ఇటుపక్క పెట్టుకోవాలి . అది కూడా డైరెక్షన్ బట్టి. చాలామంది చెత్త బుట్టను ఇంటికి అటుపక్క లేదా ఇటుపక్క పెట్టుకుంటూ ఉంటారు.  అది అస్సలు చేయకూడదు . నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి తీసుకొస్తుంది అని హెచ్చరిస్తున్నారు వాస్తు శాస్త్ర పండితులు. అంతేకాదు ఇంటి ముందు కచ్చితంగా ఒక లైట్ ఎప్పుడూ ఉండాలని అది వెలుగుతూనే ఉండాలి అని . ఇంటి గుమ్మం ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఆకర్షణీయంగా ఉండాలి అని .. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని ఆ ఇంట్లో అంతా సుఖసంతోషాలతో ఉంటుందని చెప్తున్నారు వాస్తు శాస్త్ర పండితులు.  అంతేకాదు ఎప్పటికప్పుడు పసుపు కుంకుమతో పూలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఎక్కువ కాలం స్థిరంగా ఉంటుంది అంటూ కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది . ఇంటిముందు చీపురు కట్ట కూడా అస్సలు ఉంచకూడదు అని వాస్తు శాస్త్రం చెబుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: