
అంతేకాదు శుక్రవారం పూట ఇంట్లోని ఆడవాళ్లు ఎప్పుడు ఏడవకూడదు అంటున్నారు పండితులు. శుక్రవారం పూట ఆడవాళ్లు ఇంట్లో ఏడుస్తూ గట్టిగట్టుగా అరుస్తూ ..బూతులు తిడుతూ భార్యాభర్తలు పోట్లాడుకుంటూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదట . లక్ష్మీదేవి ఎప్పుడైనా సరే శుభ్రంగా ఉన్న ఇంటికి వస్తుందట . మరి ముఖ్యంగా ఇంటి గుమ్మం ఎప్పుడు కలకలాడుతూ ఉండాలట. అలా ఉంటేనే లక్ష్మీదేవి ఆ ఇంట్లో రావడానికి ఆ ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఇష్టపడుతుందట . విడిచేసిన బట్టలు ఎక్కడికక్కడే ఉంచడం.. ఇంటిముందు చెప్పులు చిందరవందరగా ఉండడం మహిళలు శుభ్రంగా లేకపోవడం విడిచేసిన బట్టలను అలానే వేసుకుంటూ ఉండడం.. చిరిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఉండడం లాంటివి చేసే ఇళ్లల్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదట .
శుభ్రతగా ఉన్న ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడు సంతోషంగా అన్యోన్యంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుందట . అంతేకాదు లక్ష్మీదేవి నాలుగు రూపాయలు మనకు వచ్చేలా చేసినప్పుడు .. ఆ డబ్బులను అలానే దాచుకోవాలి కానీ ఖర్చు పెడితే లక్ష్మీదేవికి కోపం వచ్చేస్తుందట. మనం డబ్బులు ఇచ్చిన వీళ్లు జాగ్రత్త పరుచుకోవడం లేదు వీళ్ళకి డబ్బులు ఇవ్వడం వేస్ట్ అనే విధంగా లక్ష్మీదేవి అక్కడ స్థిరంగా ఉండలేదట . ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా భార్యాభర్తలు కలిసి తమ పనులు చేసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉన్న ఇళ్లల్లోనే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట. ఎవరైతే శుక్రవారం పూట భర్తలు భార్యలను తిడుతూ కొడుతూ వాళ్ళను హింసిస్తూ వాళ్ళ కన్నీటికి కారణం అవుతారో ఆ ఇల్లు అసలు ఎప్పటికీ ఎదిగి రాదట . పొరపాటున కూడా భార్యాభర్తలు శుక్రవారం పూట అరుచుకోవడం .. తిట్టుకోవడం .. కొట్టుకోవడం లాంటివి చేయకూడదు అంటున్నారు పండితులు . శుక్రవారం పూట ఆడవాళ్లు ఎంత మంచిగా రెడీ అయ్యి నిండుగా కనిపిస్తే ఆ ఇల్లు అంతకు నిండుగా సిరిసంపదలతో కలకలాడుతూ ఉంటుందట.
నోట్: పైన తెలిపిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం అని గుతుంచుకోవాలి..!!