పురుషుల్లో లైంగిక వాంఛ తగ్గిపోవడం అనేది ప్రస్తుతం చాలామందిని కలవరపెట్టే సమస్య. దీనికి కారణాలు. మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, శారీరక అలసట, ఆహారంలో పోషకాల కొరత, నిద్రలేమి, అధిక వయస్సు, ధూమపానం, మద్యం వంటి అలవాట్లు, ఈ సమస్యలకు ప్రాచీన ఆయుర్వేదంలో కొన్ని ఔషధాలు మరియు ప్రకృతి దత్తమైన పాదార్థాలు పరిష్కారంగా చెప్పబడ్డాయి. వాటిలో శిలాజిత్ అనే దివ్య ఔషధం ప్రధానమైనది. శిలాజిత్ అనేది హిమాలయ పర్వతాల నుంచి సేకరించే ముడి పదార్థం. ఇది శతాబ్దాలుగా శిలల మధ్య నుంచి కారిపోయే సేంద్రీయ పదార్థం. ఇది ముడతలు పడ్డ మొక్కల ద్రవ్యాల నుంచి ఏర్పడుతుంది.

ఇది గడ్డకట్టిన గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది. శిలాజిత్‌లో ఉండే ఫుల్విక్ యాసిడ్, డైబెన్జో ఆల్ఫా పైరోన్లు అనే సమ్మేళనాలు శరీరంలో టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది లైంగిక వాంఛను మరియు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శిలాజిత్ శరీరంలో మాంసపేశుల సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల ఎక్కువ సమయం పాటు శృంగారంలో పాల్గొనగలగే శక్తి వస్తుంది. దీర్ఘకాలిక అలసట, మానసిక నిస్సత్తువ, డిప్రెషన్ వలన లైంగిక ఆసక్తి తగ్గినవారికి శిలాజిత్ ఒక ప్రభావవంతమైన సహాయకారి.

శిలాజిత్ వీర్య నాణ్యత, సంఖ్య, కదలికలలో మెరుగుదల కలిగిస్తుంది. సంతానలేమితో బాధపడుతున్నవారికి ఇది ఒక సహజ చికిత్స. రోజుకు 300mg – 500mg వరకు మాత్రమే తీసుకోవాలి. గోరువెచ్చని పాలు లేదా నీటిలో కలిపి, ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకోకముందు తీసుకోవచ్చు. అయుర్వేద డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం – ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి వేరుగా ఉంటుంది. శారీరక ధైర్యాన్ని పెంపొందించి, టెస్టోస్టిరోన్‌ను మద్దతుగా నిలబెట్టే ఔషధం. శిలాజిత్‌తో కలిపి తీసుకుంటే గరిష్ట ఫలితం. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్య నాణ్యతను మెరుగుపరుస్తుంది, లైంగిక బలహీనతను తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: