
దీపం వెలిగించడం అనేది ఒక పవిత్రమైన పని మరీ ముఖ్యంగా అపవిత్రమైన శరీరంతో అలాంటి పూజలు చేయనే చేయకూడదు అంటూ చెబుతున్నారు . కొంతమంది భోజనానికి ముందు భోజనానికి తర్వాత స్నానం చేసి దీపం వెలిగిస్తారు . అయితే శాఖాహారం తిన్న తర్వాత దీపం వెలిగించొచ్చు కానీ మాంసాహారం తిన్న తర్వాత ఎట్టి పరిస్థితులను స్నానం చేయకుండా దీపం వెలిగించకూడదట . హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మాంసాహారం తిన్న తర్వాత శరీరం పూర్తిగా అపవిత్రంగా మారిపోతుంది అట . ఆ టైంలో మనం దీపం పెట్టినా కూడా ఫలితం రాకపోగా నెగిటివ్ గా మారిపోతుందట .
ఆ కారణంగానే చాలామంది చెప్తూ ఉంటారు మాంసాహారం తిన్న తర్వాత సాయంత్రం వేళలల్లో స్నానం చేసి దీపం వెలిగించండి అని. అయితే కొంతమంది మాత్రమే ఇది ట్రాష్ అంటూ కొట్టి పడేస్తూ ఉంటారు. ఎవరి వ్యక్తిగత ఒపీనియన్ వాళ్ళది . కానీ పండితులు మాత్రం అసలు ఇలా చేయని చేయకూడదు అని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేవుని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మాంసాహారం తిని ఇంటికి వచ్చి ఆ ప్రసాదాలతో పూజలు చేస్తూ ఉంటారు. అది చాలా చాలా తప్పు అంటున్నారు . గుడికి వెళ్ళిన తర్వాత పవిత్రంగా ఇంటికి వచ్చి స్నానం చేసి దీపం వెలిగించిన తర్వాతే పెద్ద ప్రసాదాలు స్వీకరించాలి అని ఆ తర్వాత మరుసటి రోజు నాన్ వెజ్ తీసుకోవాలి అని చెబుతున్నారు. కొంతమంది పెద్ద వాళ్ళు బయపెట్టడనికి ..నాన్ వెజ్ తిని పూజ చేస్తే వచ్చే జన్మలో అవిటి వాళ్లు గా పుడతారు అంటూ చెపుతూ ఉంటారు.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కొతమంది పండితులు అలాగే సోషల్ మీడియా లో ఇచ్చిన ఆధారంగా అందించబడినది అని పాఠకులు గుర్తుంచుకోవాలి. ఇది నమ్మడం లేకపోవడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..!!