
ఉదయం గోరువెచ్చటి నీటిలో చిన్న ముక్క అల్లం వేసి తాగండి లేదా తేనెతో కలిపి తీసుకోండి. అల్లం సహజ యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటుంది. జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, దగ్గు వంటి ఉంటే అల్లం తాగిన వెంటనే ఉపశమనం కలుగుతుంది. అల్లం, తులసి, లవంగం, తేనె కలిపిన కషాయం జలుబు, దగ్గుకి అద్భుతమైన ఔషధం. అల్లాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తలనొప్పిని నియంత్రించడంలో సహాయపడతాయి. మైగ్రేన్ బాధించేప్పుడు అల్లం నీరు లేదా కషాయం తాగడం వల్ల రిలీఫ్ పొందవచ్చు. ప్రయాణ సమయంలో వాంతులు వస్తుంటే, అల్లం ముక్క పీల్చడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం ఉన్నవారికి అల్లం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. భోజనం తర్వాత అల్లం లేదా అల్లం టీ తాగడం వల్ల ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. ఇది కడుపు తేలికగా, హాయిగా ఉండేలా చేస్తుంది.
అల్లా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల వయస్సు పైబడినవారిలో జాయింట్ నొప్పులను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యల్లో ఉపయోగపడుతుంది. అల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థకు శక్తిని ఇస్తుంది. ఆందోళన, ఒత్తిడి, అలసట వంటి సమస్యలకు ఇది సహాయకారిగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే క్రమపద్ధతి లేని నొప్పులను అల్లం బాగా తగ్గిస్తుంది. ఇది యూటరైన్ కన్‌ట్రాక్షన్‌ను సర్దుబాటు చేస్తుంది. రోజూ అల్లం తీసుకోవడం వల్ల శరీరానికి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా తరచూ జలుబు, ఫీవర్, చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అల్లాలోని సహజ రసాయనాలు కడుపులో ఉండే ఆమ్లాన్ని కంట్రోల్ చేస్తాయి. ఇది పెప్టిక్ అల్సర్‌ని తగ్గించడంలో సహాయకరం.