
నిద్ర సమయంలో మెదడు గతంలో నేర్చుకున్న విషయాలను ‘సేకరించి’ జ్ఞాపకాలుగా నిలుపుతుంది. సరైన నిద్ర లేకపోతే చదవిన విషయాలు సరిగా గుర్తుండవు. నిద్ర తక్కువగా ఉండటం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. నిద్ర వల్ల మెదడులో హార్మోన్‌ల సమతుల్యత కాపాడబడుతుంది. నిద్ర లేనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు అయోమయంగా ఉంటాయి. నిద్రలేమి మెదడులోని ఫ్రంటల్ కార్టెక్స్ పనితీరును దెబ్బతీస్తుంది. వారానికి కనీసం 4–5 సార్లు 30 నిమిషాల శారీరక చురుకుదల వల్ల మెదడుకు శుద్ధమైన రక్తం వేగంగా చేరుతుంది. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెంచి, మెరుగైన పనితీరుకు దోహదపడుతుంది. వ్యాయామం వల్ల అనే ప్రొటీన్ ఉత్పత్తి పెరుగుతుంది.
ఇది కొత్త న్యూరోన్స్ ఏర్పడేందుకు, ఉన్నవాటి పని మెరుగుపడేందుకు సహాయపడుతుంది. వ్యాయామం చేసిన వెంటనే మెదడులో సొరటోనిన్, డోపమైన్ లాంటి సంతోష హార్మోన్‌లు విడుదల అవుతాయి. ఇవి మెదడుకు విశ్రాంతి కలిగించి మానసిక ప్రశాంతతనిచ్చేలా చేస్తాయి. శారీరక చురుకుదల అల్జీమర్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి నిద్రకి 1 గంట ముందు ఫోన్/టీవీ ఉపయోగించవద్దు. హై ప్రోటీన్ ఆహారం, డ్రైఫ్రూట్స్, తీసుకోవడం. తినే ఆహారం మెదడుకి ప్రాణవాయువుగా పని చేస్తుంది – అందుకే జంక్ ఫుడ్ తగ్గించాలి.