ఇండస్ట్రీలో మెంటల్ కృష్ణ అని పిలిపించుకునే krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి లో మంచి నటుడు ఉన్నాడు అన్నది అందరూ ఒప్పుకోదగ్గ విషయం.రైటర్ గా పోసాని దాదాపుగా 100 సినిమాలకి పైగా చేసిన కూడా దక్కని క్రేజ్ ఆయనకి ఒక్క సినిమాతో వచ్చింది.2013లో వచ్చిన నాయక్ సినిమాలో వేసిన చిన్న పాత్ర ఆయన్ని స్టార్ ఆర్టిస్ట్ ని చేసింది. ఆ సినిమా విడుదల తర్వాత ఆయనకి ఒకటేసారి 50 సినిమాల్లో ఛాన్స్ వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకి అప్పుడు ఉన్న క్రేజ్ ని.

ఇక ఈ సినిమా తర్వాత పోసాని కి ఒక రేంజ్ లో పెరు తెచ్చిన సినిమా ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్. ఈ సినిమాలో పోసాని పాత్ర ఆ సినిమాకే పెద్ద హైలెట్. లంచం అవినీతి చెయ్యని ఒక పర్ఫెక్ట్ కానిస్టేబుల్ పాత్రలో ఆయన నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి పోటీ పడి మరి నటించిన పోసాని కి ఈ సినిమా చాలా గుర్తింపు తెచ్చింది. ఆయనలో కామెడీ యాంగిల్ మాత్రమే కాకుండా సీరియస్ రోల్స్ కూడా చాలా బాగా చేస్తాడు అని ఇండస్ట్రీ అంత అర్థం అయ్యింది. మూర్తి పాత్రలో పోసాని నిజంగా జీవించాడు అనే చెప్పాలి.

ప్రి క్లైమాక్స్ లో వచ్చే సీన్ లో పోసాని నట విశ్వరూపం చూడొచ్చు. దయ పాత్రకి మొదటిసారి సెల్యూట్ చేయడం చూసే ఆడియన్స్ వెంట్రుకలు లేచేలా చేసాయి. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 6 సంవత్సరాలు ఐతున్న కూడా చూసిన ప్రతిసారి మనం పోసాని పాత్రతో కనెక్ట్ అవుతాం. అంతలా జనాల మనసులో మూర్తి పాత్రలో నిలిచిపోయారు పోసాని గారు. ఆయనని అప్పటినుంచి కామెడీ పాత్రలకే కాకుండా సీరియస్ రోల్స్ కి కూడా దర్శకులు తీసుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: