మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా గని చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరిచినప్పటికీ ఆ వెంటనే విడుదలయిన ఎఫ్3 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ విధంగా వరుణ్ మంచి విజయంతో ఇప్పుడు తదుపరి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన యాక్షన్ స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పవచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగానే గని సినిమా చేయగా అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

సినిమా కోసం ఆయన ఎంతో శ్రమించిన కూడా సినిమాలో ప్లాట్ సరిగ్గా లేకపోవడంతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇకపోతే ఆయన తన తదుపరి సినిమాను ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పై నేపథ్యంలో ఈ చిత్రం ఉందని అంటున్నారు. ఈ సినిమా యొక్క కథ పూర్తిగా లండన్ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో వరుణ్ ఇంటర్నేషనల్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడని చెబుతున్నారు.

ఈ పాత్ర కోసం వరుణ్ మరొకసారి జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. వరుణ్ లుక్ పరంగా కొంత మేకవర్ చేసి వెంటనే సెట్స్ మీదకు వెళతారని అంటున్నారు. దాదాపు 80 నుంచి 100 కోట్ల నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా యొక్క పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఒక అగ్ర హీరో సినిమాకు ఎంతైతే బడ్జెట్ పెడుతున్నారో అంతే బడ్జెట్ ఈ సినిమాకు ఈ హీరోకు పెట్టడం విశేషం. ఇది కొంత రిస్కే అయినప్పటికీ వరుణ్ తన స్థాయిని బడ్జెట్ను పెంచుకోవడానికి ఇదే సరైన సమయం అని చెప్పాలి. ఆయన హీరోగా నటించిన ఎఫ్ 3 సినిమా 100 కోట్ల కలెక్షన్స్ సాధించుకోవడంతో ఈ హీరోకి మార్కెట్ బాగానే ఏర్పడింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: