సినిమా పరిశ్రమలో ఒక్క సారి హీరోయిన్ గా మారి స్టార్ హోదాను దక్కించుకున్న తర్వాత పర్సనల్ లైఫ్ (వైవాహిక జీవితం) లో స్థిరపడడం అంటూ జరగని పని. ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టు కోవాలి అన్న చందంగా ప్రతి ఒక్క హీరోయిన్ కూడా కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసి జీవితానికి సరిపడా సంపాదించాలి అనుకుంటారు. అంతేకానీ పెళ్లి గురించి చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఈ లోపు సోషల్ మీడియా చాలా సార్లు ఈ స్టార్ హీరోయిన్ లకు ఎవరితోనో అఫైర్ లు ఉన్నాయని, పెళ్లి చేసుకుంటారని రకరకాలుగా వార్తలను స్ప్రెడ్ చేస్తుంటారు. అయితే వాటిలో కొన్ని నిజం కాగా, చాలా వరకు అవాస్తవాలుగానే మిగిలిపోయాయి.

అయితే ఇప్పటికే ఎందరో హీరోయిన్ లు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని కూడా హీరోయిన్ లుగా కొనసాగుతున్నారు. వారిలో నయనతార, కాజల్ అగర్వాల్, కత్రినా కైఫ్, అలియాభట్, దీపిక పదుకునే లాంటి వారున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మలయాళ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ కి వచ్చి తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ నిత్యా మీనన్ కూడా త్వరలో పెళ్లి చేసుకోనుంది అని తెలుస్తోంది. ఈమె పేరుకి మలయాళీ కుట్టి అయినా... తెలుగు వారికి బాగా దగ్గరైపోయింది. ప్రస్తుతం నిత్య మీనన్ తెలుగులో కొన్ని షో లకు జడ్జ్ గా ఉంటూ కొన్ని వెబ్ సెరీస్ లను చేస్తోంది.

అయితే ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ప్రేమ పెళ్లి అట... ఇది వినగానే ఖచ్చితంగా చాలా మంది షాక్ అవ్వడం ఖాయం. కానీ మళయాల ఇండస్ట్రీ కి చెందిన స్టార్ హీరోతో ఈమె కొంతకాలంగా ప్రేమలో ఉందట. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక వార్త ఆమె నుండి వచ్చే వరకు వాటి చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: