ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఒకవైపు రాజకీయాలు.. మరొకవైపు సినిమాలు అంటూనే ఇంకొక వైపు బుల్లితెర షోలు కూడా చేస్తూ భారీ బిజీ అవుతున్నారు.. ఈ క్రమంలోని ఆయన హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం అపూర్వ ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఈ సీజన్లో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇలా చాలామంది ఈ షో కి హాజరయ్యి సందడి చేశారు. ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ కి ఆహా సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి అంటే షో కి ఏ రేంజ్ లో పాపులారిటీ లభిస్తుందో చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఎపిసోడ్లను కూడా టెలికాస్ట్ చేసి భారీ పాపులారిటీ దక్కించుకుంది.

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ కావడానికి సిద్ధం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి భాగం ఫిబ్రవరి 2 ఉదయం 9 గంటలకు స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి రికార్డు స్థాయిలో ప్రోమో వ్యూస్ సొంతం చేసుకుంది.  ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కూడా భారీ హైప్ అందిస్తోందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ప్రభాస్ ఎపిసోడ్ టెలికాస్ట్ సందర్భంగా జరిగిన కొన్ని తప్పులు మళ్ళీ జరగకుండా ముందుగానే ఆహా పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్కి సర్వర్ క్రాస్ కాకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ సర్వర్లు క్రాస్ అయినా కూడా వెంటనే పునరుద్ధరించే విధంగా ప్రణాళికలు కూడా చేస్తున్నారు.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఇప్పుడు ఆహ్ నిర్వహకులను భయపడుతోందని చెప్పవచ్చు.  ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి.  కాబట్టి అటు సినీ ప్రియులనే కాదు రాజకీయపరంగా కూడా ఏపీలో సంచలనాలు క్రియేట్ చేసేటట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: