
ఎందుకంటే గతంలో ఆయన తీసిన ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలు అన్ని బ్లాక్‌బస్టర్ హిట్స్. ప్రతి సినిమాతో తన మార్క్‌ను పెంచుకుంటూ వెళ్లిన లోకేష్ ఇప్పుడు కూలీతో బాక్సాఫీస్‌పై యుద్ధానికి సిద్ధమయ్యాడు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ – వార్ 2 సినిమాతో బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా, బాలీవుడ్, కోలీవుడ్, మలయాళ మార్కెట్‌లలోనూ రికార్డులు రాసే ఛాన్స్ ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే … లోకేష్ సినిమా మేకింగ్ స్పీడ్. ఎన్ని పెద్ద స్టార్స్ ఉన్నా… ఎంత పెద్ద బడ్జెట్ ఉన్నా… లోకేష్ సినిమా వర్కింగ్ డేస్ తక్కువే. కూలీ సినిమాను 150 రోజుల లోపే పూర్తి చేశారు. అంతకు ముందు లియో సినిమాను 120 రోజుల్లో, మాస్టర్ సినిమాను మరీ తక్కువ సమయంలో ముగించారు. స్టార్ హీరోల డేట్స్ కుదిరితే ఏడాదికి రెండు మూడు సినిమాలు ఇచ్చే స్పీడ్‌లో ఉంటాడు లోకేష్ .
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఆమీర్ ఖాన్, సౌబిన్ వంటి స్టార్‌లతో ఒకేసారి వర్క్ చేసి కూడా, ప్రాజెక్ట్‌ను టైమ్‌లో పూర్తి చేసే అరుదైన దర్శకుడు ఆయనే. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వందల కోట్ల వసూళ్లు సాధించే సినిమాలను, ఇతర దర్శకులు ఏళ్ల తరబడి తీస్తుంటే… లోకేష్ మాత్రం 100 రోజుల లోపు షూటింగ్ ముగించి సూపర్ హిట్ కొట్టే టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈ స్పీడ్, ఈ టాలెంట్, ఈ మాస్ మైండ్‌సెట్ వల్లే ఆయనను “స్పీడ్ మాన్ ఆఫ్ ఇండియన్ సినిమా” అంటారు. ఈసారి కూలీతో రజనీ – లోకేష్ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మాస్ పేలుడు సృష్టిస్తుందో… బాక్సాఫీస్ ఇప్పటికే ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.