నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ నేషనల్ లెవెల్ లో రికార్డు సృష్టించింది.ఇక ఈ ఎపిసోడ్ ఫాస్టెస్ట్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసిన ఎపిసోడ్‌గా నిలిచి ఆల్ టైమ్ రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని ఆహా టీమ్ అధికారికంగా వెల్లడించింది. "బ్లాక్ సోక్కా ఏసాడు అంటే బొమ్మ బ్లాక్ బస్టర్" అంటూ ఆహా తన ఆనందాన్ని పంచుకుంది. మొత్తానికి ఇక ఈ మొదటి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ఇంకా బాలయ్య మధ్య చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నడిచాయి.ముఖ్యంగా ఈ ఎపిసోడ్‌లో 3 పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ను బాలయ్య ప్రశ్నించగా.. తాను అసలు బ్రహ్మచారిగా ఉండాలనుకున్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు.


వ్యామోహంతో 3 పెళ్లిళ్లు చేసుకోలేదన్న పవన్ కళ్యాణ్ .. తనకు రాసిపెట్టుంది కాబట్టే అలా జరిగాయని ఆయన తెలిపారు. అంతేగాక రాజకీయాల్లో ఉండడంతో తనను విమర్శించేందుకు అది ఆయుధంగా మారిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఐతే, 'ఇన్ని పెళ్లిళ్లు నాకే జరిగాయా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది' అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం చాలా బాగా ఆకట్టుకుంది.ఇంకా అలాగే పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్ల పై ఇంకా మాట్లాడుతూ.. 'నేను ఏదీ కూడా ప్లాన్ చేయలేదు. ఫస్ట్ టైమ్ పెళ్లి చేసుకున్నాను, ఇంట్లోవారు చూసిన సంబంధం అది. అయితే ఆ రిలేషన్ షిప్ లో కొన్ని కుదరలేదు, అలా మేము విడిపోయాం. అలాగే రెండోసారి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. అప్పుడు కూడా అభిప్రాయ బేధాలొచ్చాయి. కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరక రేణుదేశాయ్ తో నేను విడిపోవాల్సి వచ్చింది అని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: