కొన్ని మూవీ లు విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల ఆదరణను బట్టి మంచి విజయాలను అందుకుంటుంటాయి. అలాగే కొన్ని సినిమాలు విడుదలకు ముందే ఆ సినిమా నుండి విడుదల అయిన పాటల ద్వారా మంచి క్రేజీ ను సంపాదించుకొని ఆ ద్వారా మంచి ఓపెనింగ్స్ ను సంపాదించుకొని అలాగే మంచి విజయాలను కూడా అందుకుంటూ ఉంటాయి. అలా విడుదలకు ముందు పాటల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ... ఆ తర్వాత విజయాలను అందుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.

ఈస్మార్ట్ శంకర్ : రామ్ పోతినేని హీరోగా నిధి అగర్వాల్ ... నబా నటేష్ హీరోయిన్ లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత సినిమాకు కూడా టాక్ సూపర్ గా రావడంతో ఈ సినిమా మంచి విజయం అందుకుంది.

ఎస్ ఆర్ కళ్యాణ మండపం : కిరణ్ అబ్బవరం హీరోగా ప్రియాంక జబల్కర్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల అయిన పాటలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది.

పెళ్లి సందD : రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంత గానో ఆలరించాయి. ఆ తర్వాత ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఉప్పెన : పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ నుండి విడుదల అయిన పాటలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: