ఏపీ: ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు బెదిరింపులు దాడులు చేయవచ్చు అనే విధంగా చాలామంది నేతలు నిరూపించారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా శాతివాహన  కళాశాల ప్రిన్సిపల్  వంకాయల శ్రీనివాస్ విడుదల చేసిన ఒక ఆడియో కాల్ సంచలనంగా మారింది. తనకు టిడిపి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన తెలియజేస్తూ ఒక ఆడియో కాల్ ని విడుదల చేశారు. విజయవాడ నగర నడి ఒడ్డున విశాలాంధ్రా రోడ్డులో ఈ శాంతివాహన కళాశాల ఉన్నదట.


అయితే ఈ కాలేజీ స్థలం తమదే అంటూ బోయపాటి అప్పారావు అక్కడ తనకు సంబంధించిన కొన్ని బోర్డులు పాతడం జరిగింది. ఈ వివాదం నేపథ్యంలో గడిచిన కొద్ది రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపాల్ ని కూడా కిడ్నాప్ చేశారు.. వీటికి తోడు కాలేజీలో ఉండే భవనాలను కూడా తమ అనుచరులతో బోయపాటి అప్పారావు కూలగొట్టించారు. అయితే ఈ విషయంపై టిడిపి ఎమ్మెల్యే కలగజేసుకోవడంతో ఇది ఒక్కసారిగా రాజకీయరంగు పులుముకుంది. తనను ఆలపాటి ఫోన్ చేసి మరి బెదిరిస్తున్నారు అంటూ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆడియో కాల్ ను మీడియాకి విడుదల చేశారు.


దీంతో విజయవాడ సీపీకి ఆయన ఫిర్యాదు కూడా చేశారు. తన మొబైల్ ని టిడిపి ఎమ్మెల్యే  ట్యాపింగ్ చేశానని ఆరోపణలు కూడా చేశారు. శాతవాహన కాలేజీ సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లడంతో తనని ఆలపాటి ఫోన్ చేసి వదలను అంటూ హెచ్చరిస్తున్నారని తెలియజేశారు కళాశాల ప్రిన్సిపాల్. అంతేకాకుండా ఆలపాటికి, శాతవాహన కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని కూడా తెలియజేశారు.. అయినా కూడా అతను చెప్పినట్టుగా వినాలని ప్రతిసారి ఆలపాటి ఆదేశిస్తున్నారని ప్రిన్సిపల్ ఆవేదన చెందుతున్నారు. తనకు ఏమైనా జరిగితే అందుకు కారణం టిడిపి ఎమ్మెల్యే బాధ్యత వహించాలి  అంటూ ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలియజేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: