ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఇప్పటికే చాలామంది వైసిపి నేతలు,కార్యకర్తలు,ప్రజలు కూడా తెలియజేస్తున్నారు.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ సీఎం జగన్ కూడా డిజిటల్ బుక్ అనే పేరుని విడుదల చేశారు.. ఇది నారా లోకేష్ స్థాపించిన రెడ్ బుక్ కి కౌంటర్ గా డీజిల్ బుక్ ని తీసుకువచ్చారు జగన్. రెడ్ బుక్ లో కేవలం లోకేష్ మాత్రమే రాసుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్ స్థాపించిన డిజిటల్ బుక్ మాత్రం ఎవరైనా అందులో తమకు జరిగిన అన్యాయం గురించి చేసిన వ్యక్తుల గురించి అందుకు సంబంధించిన ఫోటోలు కానీ అప్లోడ్ చేసుకోవచ్చు.


ఇలా ఏపీలో రెడ్ బుక్, డిజిటల్ బుక్ అనే పేరు ఇప్పుడు ఏపీ అంతట భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే జగన్ ఎన్నోసార్లు అధికార నేతలను హెచ్చరించారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందంటూ ఎన్నోసార్లు హెచ్చరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో టిడిపి, వైసిపి మధ్య అధికార పోరు కాస్త వ్యక్తిగత విద్వేషాలకు దారి తీసేలా కనిపిస్తోంది. 2014 -19 లో చంద్రబాబు పాలనలో వైసీపీ ప్రజా ప్రతినిధులను టిడిపి పార్టీలో చేర్చుకోవడంతో పాటుగా వారికి  మంత్రి పదవులు ఇచ్చి మరింత మందిని తీసుకోవాలని అనుకున్నారు.. అప్పట్లో ఆ ప్లాన్ బెడిసి కొట్టిందనే విధంగా వినిపించాయి.


కానీ 2019లో మాత్రం టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత..చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ని అనవసరంగా గెలకడంతో అటు బిజెపి, జనసేన ,టిడిపి పార్టీలు మూకుమ్మడిగా 2024 లో పోటీ చేసి భారీ విజయాన్ని అందుకునేలా చేసాయి. కేవలం వైసీపీ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. దీంతో పార్టీ తేరుకోవడం కూడా కష్టమైంది. పార్టీకీ ఈ రకమైన నేతలు గుడ్ బై చెప్పడమే కాకుండా ఇతర పార్టీలలో చేరారు.అయితే వీటికి తోడు ఇష్టానుసారంగా వైసీపీ నేతలపైన కేసులు పెట్టడం అరెస్టులు చేయడం వల్ల లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులోకి వచ్చిందని వాటివల్లే అందరిని అరెస్టు చేస్తున్నారనే విధంగా వైసీపీ నేతలు ఆరోపించారు.



వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే.. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఇప్పటికే చాలామంది నేతలతో పాటు జగన్ కూడా హెచ్చరించారు.. ఒకవేళ కూటమి పైన వ్యతిరేకతతో వైసిపి పార్టీకి మాత్రం ఈసారి పట్టం కడితే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు వస్తాయనే విధంగా వినిపిస్తున్నాయి.. అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే వారు ప్రతికారం తీర్చుకోవడానికే అన్న భావన కల్పించేలా చేస్తున్నారు రాజకీయాలు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తలచుకుంటే భయమేసేలా ఉందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: