టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా పలు చిత్రాలలో నటించి భారి క్రేజ్ అందుకున్న హీరో సుమన్ ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో తండ్రిగా నటిస్తూ ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఎక్కువగా రాజకీయాల విషయం పైన మాట్లాడుతూ ఉన్నారు సుమన్. ఇలాంటి సమయంలోనే తన రాజకీయ ప్రవేశం పైన కూడా మరొకసారి మాట్లాడడంతో  ఈసారి సుమన్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అన్నట్టుగా వినిపిస్తున్నాయి.  మరి ఏ పార్టీలో చేరుతారనే విషయం పైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.



రాజకీయ పార్టీల నుంచి తనకు ఆఫర్లు వస్తున్నాయని తాను తమిళనాడులో పుట్టి పెరిగి అక్కడే హీరోగా పేరు రావడం చేత కొన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో పోటీ చేయాలని తమను సంప్రదించారని.. అలాగే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తామంటూ హమీ కూడా ఇస్తున్నారని తెలియజేశారు. ఈ విషయాలను ఇటీవలే మీడియాలో మాట్లాడారు. దీంతో సుమన్ రాజకీయ ఎంట్రీకి మరింత బలమైన సంకేతాలు అన్నట్లుగా తెలియజేస్తున్నారు. తమిళనాడుతో పాటుగా ఏపీ రాజకీయాల పైన సుమన్ తమ అభిప్రాయాలను తెలియజేశారు.


ఏపీలో ఇప్పటికి ఎన్నికలు పూర్తి కావడంతో తాను 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి రావాలా వద్దా అనే విషయంపై సరైన నిర్ణయం తీసుకుంటాను అంటూ తెలియజేశారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన, అలాగే చంద్రబాబు పాలనను కూడా ప్రశంసించారు.దీంతో తాను ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే విషయంపై ఇంకా సరైన స్పష్టత కనిపించలేదు.కానీ హీరో సుమన్ కి మాత్రం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి హీరో సుమన్ రాజకీయ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందని విషయంపై త్వరలోనే తెలియజేస్తారట. మరి హీరో సుమన్ 2029 లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయమైతే వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: