టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చి న ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఎక్కడ ఉందో అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు.. దేశంలో ఎ హీరో కి దక్కని స్టార్ డం ఇప్పుడు ప్రభాస్ సొంతం.. అలాంటి ప్రభాస్ తన చిత్రాలలో అందరు బాలీవుడ్ యాక్టర్లను పెట్టుకుని అసలు ప్రభాస్ బాలీవుడ్ యాక్టరా.. టాలీవుడ్ యాక్టరా అని అభిమానులు సందేహాలు లేవనెత్తుతున్నారు..ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ప్రస్తుతం ప్యారిస్ లో షూటింగ్ జరుపుకుంటుండగా సంక్రాంతి కి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ ప్రభాస్ చూస్తున్నాడు..