భారత దేశంలో ఇప్పుడు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హాట్ టాపిక్ గా మారాడు.   ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న పలు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రముఖుల అవార్డుల విషయం, ఆహారపు (గోమాంసం) అలవాట్ల విషయాలపై భారత దేశంలో గందరగోళం చెలరేగుతుందని ఈ అసహనం పై  నా భార్య కిరణ్‌రావ్ పలుమార్లు నాతో చర్చించింది.

ఓ దశలో ఈ దేశం వదిలి వెళ్దామని ప్రతిపాదించిందని పేర్కొన్నారు. భారత్‌లో తీవ్ర అసహనం ఉందని, ఓ సందర్భంలో తన భార్య ఈ దేశం నుంచి వెళ్లిపోదామన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన పైన నెటిజన్లు, బిజెపి మండిపడుతోంది. రామ్ గోపాల్ వర్మ సహా పలువులు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ సీనీ స్టార్స్ నుంచి కూడా ఆయనకు వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే రవీనా టాండన్ ఫైర్ అయ్యారు.

అమీర్ ఖాన్, కిరణ్ రావ్


సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై మండి పడ్డారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యల పై  దేశద్రోహం కేసు నమోదైంది. వచ్చే నెల 1న కాన్పూర్ సెషన్స్ కోర్టులో హాజరుకావాలని ఆయనకు తాఖీదులందాయి. ఒక సెలబ్రెటీ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. ఇదే అసహనం అంశంపై రేపటి నుంచి జరుగపోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాడీవేడీ చర్చ జరుగనున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: