దేశంలో కరోనాని అరికట్టే పనిలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెసిందే. అంతకు ముందే సినిమా హాల్, మాల్స్, మద్యం షాపులు అన్నీ బంద్ చేశారు.  జిమ్ము, యోగ, ఆరోగ్యానికి సంబంధించి టిప్స్, పాటలు, డ్యాన్స్ ఒక్కటేమిటి సెలబ్రెటీలు ప్రతిరోజూ సందడే సందడి అన్నట్టు ఉంది.  ఇదిలా ఉంటే.. అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా ప్రారంభించిన 'బీ ద రియ‌ల్ మేన్‌' చాలెంజ్ కి టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇక ఈ చాలెంజ్ స్వీకరించిన నటులు, దర్శకులు, నిర్మాతలు రాజమౌళి, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేశ్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు.

 

మరికొందరు సినీ స్టార్స్, రాజకీయ నాయకులకు దాన్ని పాస్ చేశారు. అంతా ఓకే కానీ ఇప్పడు చిరంజీవి చేసిన పనికి కొంత మంది తలలు పట్టుకుంటున్నారు.. అబ్బే ఆయన అంత కాని పని చేయలేదు.. చిరు తల్లి అంజనాదేవి గారికోసం మంచి దోసె వేసి తినిపించారు. ఇదే ఇప్పుడు ఇతరులకు చిక్కొచ్చి పడింది.  పనులు అంటే ఏదో చేసి పెడతాం.. కానీ తమలా నలభీమ పాకం మా వల్ల కాదు మొర్రో అంటున్నారు. తాజాగా ఇల్లును శుభ్రం చేసిన తరువాత, చిరంజీవి స్వయంగా ఓ దోశను బ్రహ్మాండంగా వేసి, తన తల్లికి తినిపిస్తూ, అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంపై నిర్మాత, వైసీపీ నేత పీవీపీ స్పందించారు.

 

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టగా అదిప్పుడు వైరల్ అవుతోంది. "చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు..’’ అంటూ ట్విట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: