నంద‌మూరి బాల‌కృష్ణ తండ్రి ఎన్టీఆర్ న‌టించిన న‌ర్త‌న‌శాల సినిమాని తన స్వీయ ద‌ర్శ‌క‌త్వం చేస్తూ, కీల‌క పాత్రలో నటిస్తూ 2004లో న‌ర్త‌న‌శాల అనే పేరుతోనే ప్రారంభించాడు. ఎంతో అట్టహాసంగా ప్రారంభ‌మైన ఈ చిత్రంలో అర్జునుడిగా బాల‌కృష్ణ‌, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు, అభిమన్యుడిగా ఉదయ్ కిరణ్ లు న‌టించారు. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో ద్రౌపది పాత్ర పోషిస్తున్న సౌందర్య ఒక ఎన్నికల సభకు వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడంతో ఆ ప్రాజెక్టును బాలయ్య ఆపేశారు. అయితే అప్పుడు షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఈ దసరా సందర్భంగా ఆయన అభిమానుల కోరిక మేరకు ప్రేక్షకుల ముందుకు బాలయ్య తీసుకొస్తున్నారు.

 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను అక్టోబర్‌ 24న అంటే ఈరోజు బాల‌య్య ఒటీటీ ద్వారా విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఓటీటీ ద్వారా విడుద‌ల‌వుతున్న ‘నర్తనశాల’ సినిమాను చూడాలంటే రూ.50 పెట్టి టికెట్ కొనాల్సి ఉంటుంది. అయితే ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాన‌ని బాలయ్య ప్రక‌టించడంతో పాటు బాల‌య్య అభిమానులైతే ఎంతైనా పెట్టి టికెట్ కొన‌వ‌చ్చని కూడా ప్రకటించారు.

 దీంతో ఇప్పటికే కొంత మంది అభిమానులు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు పెట్టి టిక్ కొనాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని కూడా ప్రచారం జరుగుతోంది. అదలా ఉంచితే ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌క్షన్నర పైగా టికెట్ల వ‌ర‌కూ అమ్ముడు పోయాయని అంటున్నారు. అంతే కాక సినిమా అందుబాటులోకి వచ్చాక మరో లక్షన్నర బుకింగ్స్ జరిగే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఈ బుకింగ్స్ ద్వారా  దాదాపు కోటి రూపాయ‌లు దాకా వస్తుందని అంటున్నారు. ఇవి కాకా బాలయ్య అబిమానులు పది మంది పది లక్షలతో కొన్న మరో కోటి, అంటే వీటిలో సగం మళ్ళీ బాలయ్య సేవా కార్యక్రమాలకే ఉపయోగించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: