బాలీవుడ్ బడా స్టార్ అమితాబచ్చన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు... ఈయన గురించి చిన్న వార్త అయినా చిటికెలో స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. అదే తరహాలో ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం బిగ్ బి కి సంబంధించిన ఓ న్యూస్ పై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. కాకపోతే అవి నెగిటివ్ కామెంట్స్ కావడం గమనార్హం. ఓ మహిళను మీరు అందంగా ఉన్నారు అంటూ అమితాబ్ కితాబు ఇవ్వడం తగదంటున్నారు నెటిజన్లు. ఇంతకీ విషయం ఏంటంటే..? బిగ్ బీ ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ‘కౌన్ బనేగా కరోడా పతి’ అనే ఓ పాపులర్ టీవీ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ షో లో భాగంగా ఆయన ఇటీవల అంతర్జాతీ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థిక సలహాదారు గీతా గోపినాథ్ ను స్క్రీన్పై డిస్ప్లే చేసి.. తెరపై కనిపించే ఆర్థిక వేత్త 2019 నుంచి ఏ సంస్థకు చీఫ్ ఎకనమిస్ట్ గా ఉన్నారు అని ప్రశ్న సంధించారు. ఇంతవరకు సరిగానే ఉంది... ఇంతటితో ఆగకుండా, ‘‘ఆమె ఫేస్‌ ఎంత అందంగా ఉందిి, ఆర్థికవ్యవస్థతో ఆమె అందాన్ని ఎవరైనా జోడించి చూడగలమా ’’ అంటూ  ఆయన వ్యాఖ్యానించడం అసలు సమస్యగా మారింది. బిగ్ బి ఇలా ఆమె అందం గురించి మాట్లాడటం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. అతి చిన్న వయసులోనే గీతా గోపీనాథ్‌ సాధించిన గౌరవాన్ని గుర్తించడం మానేసి  ఆమె అందాన్ని ప్రస్తావించడం విచారకరమని  విమర్శిస్తున్నారు. బిగ్ బి లాంటి వ్యక్తికి ఇలా ఓ అమ్మాయి అందం గురించి మాట్లాడడం తగదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కానీ గీతా గోపినాథ్ మాత్రం ఈ విషయంపై  సానుకూలంగా స్పందించారు. తాను బిగ్ బి కి పెద్ద ఫ్యాన్ అని .. ఈ వీడియో తనకు ఎంతో స్పెషల్ అని కూడా ఆమె వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు. అయితే ఆమెకు లేని ఇబ్బంది మిగిలిన వారికి ఎందుకు అంటూ మండిపడుతున్నారు అమితాబ్ జి అభిమానులు. కొన్ని సార్లు ఇలా జరగడం అత్యంత సాధారణమైన విషయం. అయితే ఏ పనీ లేకుండా సోషల్ మీడియాలో గడుపుతూ ఉండే వారికి ఇంత కన్నా గొప్ప ఆలోచనలు ఏమి వస్తాయి. సోషల్ మీడియాని మనకు ఉపయోగపడేలాగా మాత్రమే వాడుకోవాలి, అంతే కానీ వేరొకరి మనోభావాలు దెబ్బతినేలాగా చేయడం సరి కాదు అని అమితాబ్ అభిమానాలు కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: