మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం తర్వాత వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంచు విష్ణు సాధించిన విజయం పట్ల చాలా వరకు ఇప్పుడు చర్చ కూడా జరుగుతుంది. మంచు విష్ణు లక్ష్యంగా ప్రకాష్ రాజ్ ఇంకా ఆరోపణలు కూడా చేయడం చూస్తున్నాం. మంచు విష్ణు గెలిచిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలు కూడా చేసింది. ఇక విష్ణు మాత్రం తాను భయపడకుండా పరిపాలన చేస్తాను అని ధీమాగా చెప్తూ ముందుకు వెళ్తున్నారు.

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, నూతనంగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులను మీడియా పలుకరించింది. మోహన్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నా బిడ్డ ఎంపిక కావడం చాల సంతోషం  అని అన్నారు. నా బిడ్డని శ్రీ వేంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, షిరిడి సాయి నాథుడు దీవెనలతో పాటుగా అసోసియేషన్ సభ్యుల దీవెనలతో ప్రెసిడెంట్ గా గెలుపొందాడు అని ఆయన హర్షం వ్యక్తం చేసారు.

ఎంతో బాధ్యతతో కూడిన గౌరవ ప్రదమైనది మా అధ్యక్ష పదవి అని అన్నారు ఆయన. గౌరవానికి ఎలాంటి భంగం రాకుండా నా బిడ్డ పరిపాలన చేస్తాడు అని స్పష్టం చేసారు. ఇక మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా మీడియాతో మాట్లాడారు. మా ఎన్నికలు అయినా అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చాము‌ అని చెప్పారు. ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్కరు కృషితోనే గెలుపు సాధ్యం అయింది అని ఆయన వెల్లడించారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నాం అని అన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేసినట్లు మీడియా ముఖంగానే మాకు తెలిసింది అని వారి రాజీనామా లేఖలు వచ్చాక వాటిపై స్పందిస్తా అన్నారు మంచు విష్ణు.

మరింత సమాచారం తెలుసుకోండి: