ఎవరు ఎంత చెప్పినా కూడా నాగార్జున బంగార్రాజు సినిమా విడుదల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సంక్రాంతికి విడుదల చేయాలి అని చెప్పి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర్నుంచి ప్లాన్ చేయగా విడుదల అయ్యే అంతవరకు మనసు మార్చుకోలేదు. ఆయన అలా ఆలోచించిన కారణంగానే ఇప్పుడు ఈ చిత్రానికి మంచి హిట్ దక్కడంతో పాటు భారీ వసూళ్లు కూడా దక్కాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాల లో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించుకొని నాగార్జున కెరీర్లోనే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పవచ్చు.

అయితే రవితేజ కూడా నాగార్జున లాగానే ఆలోచిస్తున్నాడు. ఆయన చేసిన సాహసమే ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన కిలాడీ చిత్రాన్ని ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మొదటి నుంచి ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనేది రవితేజ ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వాస్తవానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఆర్థిక కారణాల నేపథ్యంలో ఈ సినిమా కొన్ని రోజులు వాయిదా పడింది.

అయితే ఆర్థిక కారణాల వల్ల ఎక్కడ ఈ సినిమా ఆగిపోతుందో అనే భయం ప్రేక్షకులలో నెలకొనగా ఎట్టకేలకు ఆఖరి షెడ్యూల్ ను ఇటీవలే పూర్తి చేసిన చిత్ర బృందం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు అన్ని రకాల కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ ఆలోచన. మీనాక్షి చౌదరి డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుంది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: