హైపర్ ఆది.. ప్రస్తుతం  బుల్లితెరపై ఇతగాడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ అనే కార్యక్రమంలో ఒక సాదా సీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగాడు. ఇక ఇప్పుడు జబర్దస్త్ లోని టాప్ టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. కేవలం కమెడియన్గా మాత్రమే సరిపెట్టుకోకుండా తనలోని రైటర్ కు పని చెబుతూ ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలకు  స్క్రిప్ట్ అందిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక జబర్దస్త్ లో ప్రతీ వారం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో నవ్వులు పంచుతున్న హైపర్ ఆది అటు ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ లో కూడా పాల్గొంటున్నాడు. కాగా హైపర్ ఆది లాంటి సెలబ్రిటీల పర్సనల్  విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల హైపర్ ఆది గురించి ఒక షాకింగ్  విషయం తెలిసింది. హైపర్ ఆది మొబైల్ లో ఎంతమంది అమ్మాయిల నెంబర్లు ఉన్నాయి అన్న విషయాన్ని స్వయంగా చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవలే ఢీ కార్యక్రమంలో భాగంగా ఒక మర్డర్ జరిగితే ఇన్వెస్టిగేషన్ చేసే  స్కిట్ చేశారు.


 ఈ స్కిట్ లో భాగంగా అటు హైపర్ ఆది కి లైడిటెక్టర్ పేరుతో వైబ్రేషన్ ఇచ్చే మిషన్ అమరుస్తారు. నీ మొబైల్ లో ఎంత మంది అమ్మాయిల నెంబర్లు ఉన్నాయి అని అడుగగా.. ఇద్దరు అమ్మాయిల నెంబర్లు ఉన్నాయి అంటూ చెబుతాడు హైపర్ ఆది. దీంతో వైబ్రేషన్ ఒక్కసారిగా రావడంతో ఎగిరి గంతేస్తాడు.. ఆ తర్వాత నలుగురు అమ్మాయిల నెంబర్లు ఉన్నాయి అని చెప్పడంతో మరోసారి వైబ్రేషన్ వస్తుంది.. చివరికి నిజం ఒప్పుకొని నలుగురు కంటే ఎక్కువమంది అమ్మాయిల నెంబర్లు మొబైల్ లో ఉన్నాయి అని చెబుతాడు హైపర్ ఆది..

మరింత సమాచారం తెలుసుకోండి: