యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా ది వారియర్ అనే పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి క్రేజ్ ఉన్న లింగుసామి దర్శకత్వం వహించగా , అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటించింది. ఆది పినిశెట్టిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. కెరీర్.లో మొట్ట మొదటి సారి రామ్ పోతినేనిమూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో ఈ మూవీ పై రామ్ అభిమానులతో పాటు , సామాన్య సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ జూలై 14 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దానితో ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం కూడా దక్కలేదు. ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ది వారియర్ మూవీ తాజాగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ది వారియర్ మూవీ ఈ రోజు నుండి అనగా ఆగస్ట్ 11 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫాల్ లలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాము అని మిస్ అయిన వారు ఉంటే ఇవాల్టి నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: