నిఖిల్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వం లో తెరకె క్కిన కార్తికేయ మూవీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిందే . కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా కార్తికేయ 2 మూవీ ని దర్శకుడు చందు మొండేటి నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కించాడు . ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదలయ్యింది . ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది . ఇప్పటి వరకు నాలుగు రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం .
నైజాం : 5.00 కోట్లు , సీడెడ్ : 2.14 కోట్లు , యూ ఏ : 1.79 కోట్లు , ఈస్ట్ : 1.16 కోట్లు , వెస్ట్ : 83 లక్షలు , గుంటూర్ : 1.30 కోట్లు , కృష్ణ : 1.02 కోట్లు , నెల్లూర్ : 47 లక్షలు .

 
నాలుగు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 మూవీ 13.71 కోట్ల షేర్ , 21.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్  ఇండియా లో  : 1.05 కోట్లు .ఓవర్ సీస్ లో : 2.55 కోట్లు . నార్త్ ఇండియా :  1.20 కోట్లు . ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజులకు గాను కార్తికేయ 2 మూవీ 18.51 కోట్ల షేర్ , 32.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: