ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయ్యింది.ఇక వారితో అగ్రిమెంట్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఒకటి రెండు రోజుల్లోనే వారిని క్వారెంటైన్ కి కూడా పంపిస్తారు అంటున్నారు. కాగా ఈ సమయంలోనే బిగ్బాస్ సీజన్ 6 కి సంబందించిన ప్రారంభోత్స ఎపిసోడ్ కోసం సెట్ ను ఏర్పాటు చేయడం తో పాటు కంటెస్టెంట్స్ ప్రాక్టీస్ లో మునిగి ఉన్నారు.ఇదిలావుంటే మరో వైపు ప్రముఖులను ఆహ్వానించేందుకు గాను స్టార్‌ మా వర్గాల వారు సిద్ధం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి.

కాగా బిగ్బాస్ గ్రాండ్ ప్రారంభోత్సవ ఎపిసోడ్ కు రికార్డు స్థాయి రేటింగ్ ను దక్కించుకోవడం కోసం స్టార్‌ మా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోది.ఇకపోతే  ప్రారంభోత్సవ ఎపిసోడ్‌ ఆధారంగానే మొత్తం సీజన్ ను కొందరు అంచనా వేస్తారు.ఇక  అందుకే అన్ని విధాలుగా అద్భతంగా ఉంది అన్నట్లుగా టాక్ రావడం కోసం అభిమానులను అలరించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలావుంటే  ఈసారి సామాన్యులకు ఛాన్స్ ఇవ్వబోతున్నారు. అయితే కనుక వారికి సంబంధించిన ఏవీ చిత్రీకరణ లు కూడా జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక మొత్తానికి ప్రారంభోత్సవ ఎపిసోడ్‌ హడావుడి మొదలు అయ్యింది.

ఇకపోతే ముగ్గురు టాలీవుడ్‌ హీరోయిన్స్ బిగ్ బాస్ ప్రారంభోత్సవ ఎపిసోడ్‌ లో డాన్స్ చేయబోతున్నారు.ఇక  అంతే కాకుండా ఒక్కో కంటెస్టెంట్ వెళ్లిన సమయంలో వారి యొక్క విభిన్నమైన ప్రోమో ను వేయడం తో పాటు ప్రతి కంటెస్టెంట్ కూడా ఏదో ఒక పర్ఫెర్మాన్స్ ను ఇవ్వబోతున్నారట.అయితే  ఇదే ఈ సీజన్ యొక్క ప్రారంభోత్సవ ఎపిసోడ్ కి హైలైట్ గా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుంటే  స్టార్‌ మా లో మరో వంద రోజుల పాటు రేటింగ్‌ జాతర ఉండేలా బిగ్ బాస్ ని ప్లాన్‌ చేస్తున్నారు.అంతేకాదు  నాగార్జున పై చిత్రీకరించిన మరో ప్రోమో ను విడుదల చేయబోతున్నారు. ఇక సెప్టెంబర్‌ మొదటి ఆది వారం సీజన్ 6 కి అంకురార్పణ చేయబోతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: